ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Drugs racket: రూ.2000 కోట్ల డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు.. సినీ నిర్మాత కీలక సూత్రధారి

ABN, Publish Date - Feb 25 , 2024 | 08:34 AM

ఢిల్లీ పోలీసులు(Delhi police), ఎన్‌సీబీ(NCB)ల సంయుక్త ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా నెట్‌వర్క్‌(Drugs racket) గుట్టును రట్టు చేశారు. అయితే ఈ దాందాలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ పెద్ద నిర్మాతగా కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు(police) గుర్తించారు.

ఢిల్లీ పోలీసులు(Delhi police), ఎన్‌సీబీ(NCB)ల సంయుక్త ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా నెట్‌వర్క్‌(Drugs racket) గుట్టును రట్టు చేశారు. అయితే ఈ దాందాలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ పెద్ద నిర్మాతగా కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు(police) గుర్తించారు. అతని చిత్రం మార్చిలో విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, అతనికి లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశామన్నారు.

ఈ నెట్‌వర్క్ భారతదేశం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలకు విస్తరించిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా ఢిల్లీ(Delhi)లో వారి నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్(Pseudoephedrine) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెల్త్ మిక్స్ పౌడర్, ఎండు కొబ్బరి వంటి ఆహార పదార్థాల ముసుగులో కొన్ని సరుకుల ద్వారా దీనిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.


సూడోపెడ్రిన్ (Pseudoephedrine)ను మెథాంఫేటమిన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న ఔషధం. దీనిని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కిలో రూ.1.5 కోట్లకు విక్రయిస్తున్నారు. దాదాపు 4 నెలల విచారణ తర్వాత ఈ సిండికేట్ సరుకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. దీని తర్వాత ఫిబ్రవరి 15న పశ్చిమ ఢిల్లీలోని బసాయి దారాపూర్‌లోని గోదాంపై తనిఖీల్లో భాగంగా 50 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆ క్రమంలో ఈ ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అందరూ తమిళ వాసులు. గత 3 ఏళ్లలో వీరు మొత్తం 45 సరుకులు పంపారని, అందులో సుమారు 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ఆయా దేశాలలో ఉన్న నిందితులను కూడా అరెస్టు చేయడానికి NCB న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అధికారులను సంప్రదించినట్లు పోలీసులు(police) వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Hyderabad: ఆన్‌లైన్‌లో నగదు పంపుతానని మోసం.. సర్వర్‌ సమస్య ఉందంటూ నమ్మబలికి..

Updated Date - Feb 25 , 2024 | 08:35 AM

Advertising
Advertising