ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Firecracker Factory: ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి, పారిపోయిన యజమాని

ABN, Publish Date - Aug 25 , 2024 | 01:46 PM

ఓ గోడౌన్‌లో నలుగురు వ్యక్తులు పేలుడు పదార్థాల తయారీలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలోనే పేలుడు సంభవించడంతో పటాకుల తయారీలో నిమగ్నమైన ఇద్దరు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న సీఎం సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Mayiladuthurai district tamil blast

మరో రెండు నెలల్లో దీపావళి పండుగ జరగనున్న నేపథ్యంలో పటాకుల తయారీ పనులు(firecracker factory) ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న ఓ గోడౌన్‌లో నలుగురు వ్యక్తులు పేలుడు పదార్థాల తయారీలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలోనే పేలుడు సంభవించడంతో పటాకుల తయారీలో నిమగ్నమైన తిరువావడుతురైకి చెందిన కర్ణన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే కాలియాపెరుమాళ్, లెచ్చుమనన్, కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన తమిళనాడు(tamil Nadu) మైలాడుతురై జిల్లా(Mayiladuthurai district) కుతాలం తాలూకాలోని తిరువలంగడు గ్రామంలో చోటుచేసుకుంది.


ఘటనలో

సమాచారం అందుకున్న గుత్తాలం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గూతాలం పోలీసులు(police) క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో మైలాడుతురై జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మణన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మైలాడుతురై బాణాసంచా ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకి చేరింది. దీంతో మైలాడుతురై జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.


మరో ఇద్దరు

ఘటనా స్థలాన్ని మైలాడుతురై ఎస్పీ స్టాలిన్ స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ మహాభారతి, జిల్లా రెవెన్యూ అధికారి మణిమేకలై కూడా పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించిన తర్వాతే పేలుడుకు గల కారణాలు తెలుస్తాయని జిల్లా కలెక్టర్ మహాభారతి తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బాణసంచా ఫ్యాక్టరీ యజమాని సెల్వం కనిపించకుండా పోవడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.


సీఎం సాయం

ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 3 లక్షల సాయం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ. లక్ష ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఘటనా స్థలంలో డిప్యూటీ సూపరింటెండెంట్ మురుగేషన్, నత్తం ఇన్‌స్పెక్టర్ తంగ మునియస్వామి ఆధ్వర్యంలో 20 మందికి పైగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Cyber Alert: ఇమెయిల్‌కు వచ్చే ఈ లెటర్ల విషయంలో జాగ్రత్త.. కేంద్రం అలర్ట్

Hyderabad: స్నేహితుడే హంతకుడు...


Read More Crime News and Latest Telugu News

Updated Date - Aug 25 , 2024 | 01:49 PM

Advertising
Advertising
<