Accident: లగ్జరీ కార్ డ్రైవింగ్ చేసి మైనర్ యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
ABN, Publish Date - May 19 , 2024 | 04:07 PM
పోర్షే లగ్జరీ కారు(Porsche car)లో వేగంగా వస్తున్న వ్యక్తి ఆకస్మాత్తుగా వచ్చి ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టాడు(accident). దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణె(pune)లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోర్షే లగ్జరీ కారు(Porsche car)లో వేగంగా వస్తున్న వ్యక్తి ఆకస్మాత్తుగా వచ్చి ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టాడు(accident). దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణె(pune)లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు చోటుచేసుకుంది. వెంటనే గమనించిన స్థానికులు స్థానికులు కారు డ్రైవర్‌ను పట్టుకుని తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు. అయితే కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తి 17 ఏళ్ల మైనర్ అని పూణె సిటీ డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఓ క్లబ్‌లో పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా కళ్యాణి నగర్ జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగిందన్నారు.
ఈ కేసులో రియల్ ఎస్టేట్ డెవలపర్ కొడుకు అయిన మైనర్ పోర్షే కారును డ్రైవింగ్(driving) చేసిన క్రమంలో పూణే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ మద్యం సేవించి ఉన్నాడా లేదా అనే విషయాన్ని గుర్తించేందుకు వైద్య పరీక్షల చేస్తున్నట్లు చెప్పారు. అతనిపై ఎరవాడ పోలీస్ స్టేషన్‌లో 279 (ర్యాష్ డ్రైవింగ్), 304A (నిర్లక్ష్యం వల్ల మరణం), 337 (మానవ ప్రాణాలకు హాని కలిగించడం), 338 (తీవ్రమైన గాయం కలిగించడం), మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలతో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు మైనర్ వ్యక్తికి కారు ఇవ్వడమేంటని స్థానికులు(local people) ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అసలు ఆ యువకుడికి డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత కూడా లేదని అంటున్నారు. ఇలాంటి వారికి కార్లు లేదా బైక్స్ ఇచ్చి రోడ్లపైకి పంపించడం వల్ల సామాన్య ప్రజలకు యాక్సిడెంట్ చేసి వారి కుటుంబాల్లో విషాధం నింపుతున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. డబ్బులు ఎక్కువగా ఉంటే అలాంటి కార్లకు డ్రైవర్‌ను పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
Read Latest Crime News and Telugu News
Updated Date - May 19 , 2024 | 04:10 PM