ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Maha shivratri: ఆర్కేబీచ్‌లో మహా కుంబాభిషేకం.. తరలివచ్చిన భక్తులు

ABN, Publish Date - Mar 08 , 2024 | 01:25 PM

Andhrapradesh: నగరంలోని ఆర్కే బీచ్‌లో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామి రెడ్డి ఆధ్వర్యంలో మహా కుంబాభిషేకం చేపట్టారు. కుంబాభిషేకాన్ని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు.

విశాఖపట్నం, మార్చి 8: నగరంలోని ఆర్కే బీచ్‌లో మహా శివరాత్రి (Maha Shivratri) ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామి రెడ్డి (Former Union Minister Subbirami Reddy) ఆధ్వర్యంలో మహా కుంబాభిషేకం చేపట్టారు. కుంబాభిషేకాన్ని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి (Visakha Sri Sarada Peethadhipati Swarupanandendra Saraswati) ప్రారంభించారు. మహా శివుడి అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు తరలివస్తున్నారు.

BJP: బీజేపీ పెద్ద స్కెచే వేసిందిగా..? బెంగాల్‌ లోక్ సభ నుంచి బరిలోకి ఆ క్రికెటర్..!!


ఈ సందర్భంగా స్వామి స్వరూపానంద మాట్లాడుతూ.. దేశం మొత్తం శివనామస్మరణ చేస్తోందన్నారు. అన్ని కుటుంబాలు కూడా శివుడికి అభిషేకం చేయడం ఆనవాయితీ అన్నారు. విశాఖ చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని చెప్పుకొచ్చారు. శివుడికి అభిషేకం చేసుకోలేని వారి కోసం విశాఖలో సుబ్బిరామి రెడ్డి కుంబాభిషేకం ఏర్పాటు చేశారన్నారు. 39 ఏళ్లుగా విశాఖలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు.

Pawankalyan: ప్రతి స్త్రీమూర్తికీ మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..


టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. 39 సంవత్సరాలుగా విశాఖలో ఈ కుంబాభిషేకం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐదు సంవత్సరాలు నుంచి కోటి లింగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కుంబాభిషేకం వలన ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. కుంబాభిషేకం వలన తుఫానుల లాంటి విపత్తుల నుంచి ప్రజల రక్షించబడుతున్నారని తెలిపారు. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ప్రత్యేక పూజులు చేస్తున్నామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

Palle Raghunath Reddy: ఒక్కరాజధాని కట్టలేని దద్దమ్మ.. 3 రాజధానులు కడతానంటే నమ్ముతారా?

Bangalore: చిన్నవాళ్లేకాని ఎంత పెద్ద మనసో.. ఏం చేశారో తెలిస్తే మీరుకూడా...



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 08 , 2024 | 01:25 PM

Advertising
Advertising