ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ugadi: ఉగాది పచ్చడి.. ఆరు రుచుల వెనుక దాగి ఉన్న సైన్స్.. అదేంటంటే..

ABN, Publish Date - Apr 08 , 2024 | 04:49 PM

ఉగాది.. ఈ పేరు చెబితే చాలు ఆరు రుచులు కలగలిపిన ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది. తెలుగు ప్రజలకు నూతన సంవత్సరానికి నాంది ఈ పర్వదినం. అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు ఇలా ఆరు రకాల రుచులతో కలిపిన పచ్చడిని తయారీ చేసి దేవునికి నైవేధ్యంగా సమర్పిస్తారు.

ఉగాది.. ఈ పేరు చెబితే చాలు ఆరు రుచులు కలగలిపిన ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది. తెలుగు ప్రజలకు నూతన సంవత్సరానికి నాంది ఈ పర్వదినం. అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు ఇలా ఆరు రకాల రుచులతో కలిపిన పచ్చడిని తయారీ చేసి దేవునికి నైవేధ్యంగా సమర్పిస్తారు. అనంతరం ఇంటిల్లిపాదీ స్వీకరిస్తారు. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సైన్స్ సైతం దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉగాది పర్వదినం వసంత కాలంలో వస్తుంది. వసంతం తర్వాత గ్రీష్మ రుతువు వస్తుంది. అంటే ఎండలు ( Summer ) మండిపోయే కాలం. కాబట్టి ఈ పానీయాన్ని సేవించడం వల్ల రాబోయే ఎండలకు శరీరాన్ని సంసిద్ధం చేస్తున్నట్లు అవుతుందని సైన్స్ పరంగా ఇప్పటికే నిరూపితమైంది.


Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా డిమాండ్ పిటిషన్ పబ్లిసిటీ కోసమే.. హైకోర్టు

ఉగాది పచ్చడిలో కలిసే ఆరు రుచులు వేసవి ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే కండరాల పుష్టికి తోడ్పడతాయి. హిందువుల పండుగలలో ఉగాది నాడు చేసే పచ్చడికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ ఆరు రుచులు నిజజీవితంలో ఎదుర్కొనే సమస్యలు, కష్టాలు ,సుఖాలు, దుఃఖాలు, లాభాలు సంతోషాలను తెలుపుతుంది. తీపి సంతోషాన్ని, చేదు బాధను, కారం దుఃఖాన్ని సూచిస్తాయి. పచ్చని కొమ్మలతో వేప పూతలు, మామిడి పిందెలతో ఉగాది పర్వదినం కన్నుల పండువగా ఉంటుంది.


PM Modi: రామ మందిర నిర్మాణంపై కాంగ్రెస్ కూటమి కన్నెర్ర.. ప్రధాని మోదీ

అసలైన కొత్త సంవత్సరం అంటే జనవరి 1తో ప్రారంభమవదు. అది ఉగాదితోనే ప్రారంభమవుతుందని పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ మొట్టమొదటగా జరుపుకునే పండుగ ఉగాది. తెల్లవారు జామునే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో పాటు పిండివంటలు చేసుకుంటారు. సాయంత్రం పంచాంగ శ్రవణం కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 08 , 2024 | 04:51 PM

Advertising
Advertising