ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సురేఖ..

ABN, Publish Date - Jul 09 , 2024 | 11:19 AM

బల్కంపేట ఎల్లమ్మతల్లి(Balkampet Yellamma) కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కల్యాణాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచీ పెద్దఎత్తున భక్తులు, ప్రముఖులు తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామీఅమ్మవార్లను అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister konda surekha) దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆలయానికి చేరుకున్నారు.

హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మతల్లి(Balkampet Yellamma) కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కల్యాణాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచీ పెద్దఎత్తున భక్తులు, ప్రముఖులు తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామీఅమ్మవార్లను అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister konda surekha) దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆలయానికి చేరుకున్నారు.


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.." అమ్మవారి కల్యాణ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా చూడటం నా అదృష్టం. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆలయ అభివృద్ధికి రూ.4.5కోట్లు నిధులు మంజూరు చేశాం. త్వరలో ఆ నిధులతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రజలకు అనారోగ్యాలు లేకుండా చూడాలని అమ్మవారిని మొక్కుకున్నా. పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉండాలి. నాతోపాటు వేలాది మంది కల్యాణ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. అధికారులు చేసిన ఏర్పాట్లు చాలా సంతృప్తికరంగా ఉన్నాయని" చెప్పారు.


భారీ సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఆలయ అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. గతేడాది సుమారు 10లక్షల మంది భక్తులు అమ్మవారి పెళ్లి వేడుక, తదనంతరం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఆలయం చుట్టుపక్కల ప్రధాన రహదారులు మూసివేశారు. ఈ సందర్భంగా రేపు(బుధవారం) రాత్రి 8గంటలకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆలయం వద్దకు వచ్చేందుకు హైదరాబాద్ ప్రధాన మార్గాల గుండా ఆర్టీసీ సుమారు 80ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రేపు సాయంత్రం 6గంటలకు నిర్వహించే రథోత్సవంతో అమ్మవారి కల్యాణ వేడుక ముగుస్తుంది.

Updated Date - Jul 09 , 2024 | 11:24 AM

Advertising
Advertising
<