ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rama Ekadashi: రామ ఏకాదశి విశిష్టత, రామ ఏకాదశి రోజు ఏం చేయాలంటే..

ABN, Publish Date - Oct 25 , 2024 | 08:37 AM

హిందూ వేద క్యాలెండర్ ప్రకారం కార్తీకమాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి అక్టోబర్ 27 (ఆదివారం)న ఉదయం 5.23 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 28(సోమవారం)న ఉదయం 7:50 గంటలకు ముగుస్తుంది.

ఇంటర్నెట్ డెస్క్: హిందూ మతంలో రామ ఏకాదశి (Rama Ekadashi)కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రామ ఏకాదశిని దీపావళి పండగ ముందు జరుపుకుంటారు. ఈ ఏకాదశి కార్తీక మాసంలోని కృష్ణపక్షంలో వస్తుంది. ఈ రోజున విష్ణుమూర్తి, ఆయన భార్య లక్ష్మీదేవిని భక్తులు భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. విష్ణువు మరో రూపమైన రాముడి పేరు మీదుగా దీన్ని "రామ ఏకాదశి" అని పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతాడని హిందువులు నమ్ముతారు. ఏకాదశి నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో అష్టఐశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు.


రామ ఏకాదశి తిథి..

హిందూ వేద క్యాలెండర్ ప్రకారం కార్తీకమాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి అక్టోబర్ 27 (ఆదివారం)న ఉదయం 5.23 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 28(సోమవారం)న ఉదయం 7:50 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం అక్టోబర్ 28న రామ ఏకాదశి ఉపవాసం చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 29 ఉదయం 06:31 గంటల నుంచి 10:31 గంటల వరకూ విష్ణుపారణ, శ్రీరామ పారణ చేయవచ్చు.


రామ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అది మోక్షానికి మార్గం తెరుస్తుందని, దీని ద్వారా జీవనం, మరణం అనే చక్రం నుంచి విముక్తి పొందుతామని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల జీవితంలోని అన్ని రకాల ఆటంకాలు నశించి.. విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆరోగ్య ప్రయోజనాలు, జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయని నమ్ముతారు. ఈ రోజున ఏ పనులు చేస్తే శుభప్రదంగా భావిస్తారో, పొరపాటునా ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.


రామ ఏకాదశి రోజు ఏం చేయాలి?

  • శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయండి. తులసి మొక్కకు నీరు సమర్పించి దీపం వెలిగించండి.

  • రామ ఏకాదశి నాడు దానం చేయడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. మీరు ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయవచ్చు.

  • ఈ రోజు ఉపవాసం ఉండటం చాలా శుభప్రదం. మీరు పండ్లు లేదా అల్పహారం సేవించవచ్చు.

  • పూజ సమయంలో విష్ణు మంత్రాలను జపించండి. ‘ఓం నమో నారాయణాయ’ అంటూ స్వామివారి జపం చేయండి.

  • ఆ రోజు రామ ఏకాదశి కథ వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి పుణ్యం లభిస్తుంది. కావున రామ ఏకాదశి కథ వినండి.


రామ ఏకాదశి రోజున ఏం చేయకూడదు?

  • రామ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం వంటి పదార్థాలను తీసుకోవద్దు.

  • ఏకాదశి రోజున ఎవరిపైనా కోపం తెచ్చుకోకూడదు. గొడవ పడడం, వాదించడం వంటి పనులు వ్రత పవిత్రత నాశనం చేస్తాయి.

  • ఏకాదశి రోజు రాత్రి జాగరణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. రాత్రిపూట నిద్రపోకుండా ఉండండి. విష్ణువు స్తోత్రాలు, కీర్తనలు స్తుతించండి.

  • ఏకాదశి రోజున అహింస పాటించాలి. ఏ ప్రాణికీ హాని కలిగించవద్దు. హింసాత్మక ఆలోచనలు చేయవద్దు.


రామ ఏకాదశి ప్రాముఖ్యత..

రామ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాల నుంచీ విముక్తి పొందుతామని భక్తులు విశ్వసిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి కటాక్షంతో ఆర్థికంగా బలపడతామని నమ్ముతారు. జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారు ఉపవాసం చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని భావిస్తారు. భక్తిశ్రద్ధలతో రామ ఏకాదశి రోజు చేసే ఉపవాసం మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందువల్ల రామ ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తి, నియమాలతో ఆచరిస్తుంటారు. తద్వారా విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామని, జీవితంలో ఆనందం, సకల సంతోషాలు, శాంతి కలుతాయని నమ్ముతారు.

Updated Date - Oct 25 , 2024 | 08:37 AM