CBSE: పరీక్షలు వాయిదా..క్లారిటీ ఇచ్చిన బోర్డు
ABN, Publish Date - Feb 16 , 2024 | 08:37 PM
దేశ రాజధాని ఢిల్లీ సహా పలు చోట్ల రైతుల నిరసనల కారణంగా CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా వేసినట్లు ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ అంశంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం స్పందించింది.
దేశ రాజధాని ఢిల్లీ సహా పలు చోట్ల రైతుల నిరసనల కారణంగా CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా వేసినట్లు ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ అంశంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం స్పందించింది. అది నకిలీ సర్క్యులర్ అని సీబీఎస్‌ఈ తెలిపింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మోద్దని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని విద్యార్థులు, తల్లిదండ్రులకు బోర్డు హామీ ఇచ్చింది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయోద్దని సూచించింది.
ఇక వైరల్ అవుతున్న ప్రకటనలో రైతుల నిరసన కారణంగా బోర్డు సమస్యలు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు సమయానికి హాజరు కాలేకపోతున్నారని బోర్డు దృష్టికి వచ్చిందని.. అందుకే 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు కొత్త తేదీలు త్వరలో తెలియజేస్తామని నకిలీ సర్క్యులర్‌లో వెల్లడించారు.
మరోవైపు ఢిల్లీలో విధించిన ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ముందుగానే తమ ఇళ్ల నుంచి బయలుదేరాలని బోర్డు గుర్తు చేసింది. పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. విద్యార్థులందరూ ఉదయం 10 గంటలకు లేదా అంతకంటే ముందే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సీబీఎస్‌ఈ తెలిపింది.
Updated Date - Feb 16 , 2024 | 08:37 PM