ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

US Student Visa Slots: అమెరికా వెళ్లాలనుకుంటున్నారా.. మీ కోసం ఈ గుడ్‌న్యూస్

ABN, Publish Date - May 08 , 2024 | 12:59 PM

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు కలలు కటుంటారు. ముఖ్యంగా అమెరికా వెళ్లి చదవుకోవాలని, అక్కడ ఉద్యోగం చేయాలని ఎంతోమంది ఆశిస్తుంటారు. అటువంటి విద్యార్థుల కోసం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం గుడ్‌న్యూస్ చెప్పింది. స్టూడెంట్ వీసా స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్టు ప్రకటించింది. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు మే 31 వరకు స్టూడెంట్ వీసా స్లాట్ బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.

US VISA

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు కలలు కటుంటారు. ముఖ్యంగా అమెరికా వెళ్లి చదవుకోవాలని, అక్కడ ఉద్యోగం చేయాలని ఎంతోమంది ఆశిస్తుంటారు. అటువంటి విద్యార్థుల కోసం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం గుడ్‌న్యూస్ చెప్పింది. స్టూడెంట్ వీసా స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్టు ప్రకటించింది. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు మే 31 వరకు స్టూడెంట్ వీసా స్లాట్ బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యా లయంతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతాలోని కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో వీసా స్లాట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అమెరికాలో స్టూడెంట్ వీసా జారీలో ఈసారి విస్తృత స్థాయిలో స్లాట్లు విడుదల చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ నెలకు సంబంధించిన స్లాట్లను మే మూడో వారంలో, ఆ తర్వాత జులైకు, అవసరాన్ని బట్టి ఆగస్టు నెల వరకు ఇంటర్వ్యూ తేదీలనూ విడుదల చేస్తారు. విద్యార్ధుల నుంచి అందే దరఖాస్తుల ఆధారంగా తేదీలను కేటాయిస్తారు.

JEE Advanced 2024: నేటి నుంచే JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్.. ఎలా అప్లై చేయాలంటే


అమెరికాలో చదవాలంటే..

అమెరికాలో రెండు సెమిస్టర్ల విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు ఫాల్ సీజన్ ప్రతి సంవత్సరం ఆగస్టు-సెప్టెంబరులో ప్రారంభం అవుతుంది. దీనిలో భాగంగా అమెరికాలో చదువుకోవానుకునే విద్యార్థులకు స్టూడెంట్ వీసాల కోసం స్లాట్స్ విడుదల చేసింది. అమెరికా రాయబార కార్యాలయంతో పాటు దేశంలోని కాన్సులేట్ కార్యాలయాలకు శని, ఆదివారాలు సెలవు. విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి వేలిముద్రల నమోదుకు శని,ఆదివారాలైన మే నెల 19, 26 తేదీల్లో కూడా స్లాట్లు కేటాయించారు.


పర్యాటక వీసాలు ఎప్పుడంటే..

విద్యార్థుల వీసాల జారీ ప్రక్రియ పూర్తయిన తర్వాత పర్యాటక వీసాలు (బి1, బి2) స్లాట్లు అందుబాటులోకి వస్తాయని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు చివరి వారం లేదా అక్టోబరులో యూఎస్‌ టూరిస్ట్‌ వీసా స్లాట్లు జారీ అవుతాయి. మరోవైపు వీసాల జారీ ప్రక్రియను మరింత సరళతరం చేసినట్టు భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.


UGC: ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పీహెచ్‌డీ విషయంలో కీలక నిర్ణయం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2024 | 01:02 PM

Advertising
Advertising