Telugu University: తెలుగు వర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్
ABN, Publish Date - Jul 25 , 2024 | 12:25 PM
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్లకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతీ ఏడాది జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసే తెలుగు యూనివర్సిటీకి ఈ సారి రాష్ట్ర విభజన చట్టం పదో షెడ్యూల్ అడ్డుగా వచ్చిన్నట్లు తెలిసింది.
హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్లకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతీ ఏడాది జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసే తెలుగు యూనివర్సిటీకి ఈ సారి రాష్ట్ర విభజన చట్టం పదో షెడ్యూల్ అడ్డుగా వచ్చిన్నట్లు తెలిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పదేళ్ల గడువు తీరడంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే విడి విడిగా నోటిఫికేషన్ వేసుకోవాలని తెలుగు యూనివర్సిటీ ఏపీకి విజ్ఞప్తి చేసింది.
మరో ఏడాది పాటు ఉమ్మడిగా నోటిఫికేషన్ వేయాలంటూ ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఏపీలో ఉన్న తెలుగు వర్సిటీ పీఠాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలుగు వర్సిటీతో పాటు వరంగల్‌లో అనుబంధంగా ఉన్న జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ఉన్న కోర్సులకే అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్, వరంగల్ ప్రాంగణాల్లో గల తెలుగు, చర్రిత– పర్యాటకం, జర్నలిజం, భాషాశాస్త్రం, శిల్పం– చిత్రలేఖనం, డిజైన్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, జ్యోతిష్యం, యోగా సబ్జెక్టులతో తెలుగు యూనివర్సిటీ పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
సాధారణ రూసుంతో ఆగస్టు 8వ తేదీ వరకు, ఆలస్య రుసుముతో ఆగస్టు 19వ తేదీ వరకు తెలుగు యూనివర్సిటీ వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.
Updated Date - Jul 25 , 2024 | 12:25 PM