ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NEET UGC Results: నీట్ యూజీ రివైడ్జ్ రిజల్ట్ విడుదల..

ABN, Publish Date - Jul 25 , 2024 | 06:44 PM

NEET UGC Revised Results: నీట్ యూజీ రివైజ్డ్‌ పరీక్షా ఫలితాలను, టాపర్ల వివరాలను ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసినట్లు ఎన్‌టీఏ అధికారులు తెలిపారు.

NEET UGC Results

NEET UGC Revised Results: నీట్ యూజీ రివైజ్డ్‌ పరీక్షా ఫలితాలను, టాపర్ల వివరాలను ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసినట్లు ఎన్‌టీఏ అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ స్కోర్‌లను అధికారిక వెబ్‌సైట్ exams.nta.ac.inలో చెక్ చేసుకోవచ్చునని తెలిపింది. నీట్ పరీక్షలో ఫిజిక్స్ విభాగంలో ప్రశ్న నెంబర్ 29కి కొంతమంది విద్యార్ధులకు ఇచ్చిన మార్కులు ఉపసంహరించుకోవాలని ఇటీవల ఎన్‌టీఏను ఆదేశించింది సుప్రీంకోర్టు. అత్యున్నత ధర్మాసనం ఆదేశాల మేరకు ఆ ప్రశ్నకు సంబంధించి విద్యార్థులకు ఇచ్చిన మార్కులను ఉపసంహరించుకుంది ఎన్‌టీఏ. అనంతరం రివైజ్ చేసిన మార్కుల ఫలితాలను విడుదల చేసింది.


అసలేం జరిగింది..

NEET UG పరీక్షలో ఫిజిక్స్‌ విభాగంలోని అటామిక్‌ థియరీకి సంబంధించిన 29వ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి. వాటిలో దేన్ని ఎంపిక చేసినా.. మార్కులిచ్చారు. ఇదే అంశాన్ని సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌తో కూడిన ముగ్గురు నిపుణులతో బృందాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రశ్నకు సరైన సమాధానాన్ని చెప్పాలని ఆదేశించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. క్వశ్చన్ నెంబర్ 29లో ఆప్షన్ 4 ఎంచుకున్న వారికే మార్కులు వేయాలని.. మిగతా వారికి తొలగించాలని ఎన్‌టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది.


కోర్టు ఆదేశాల మేరకు ఎన్‌టీఏ రివైడ్జ్‌ ఫలితాలను విడుదల చేసింది. తాజా ఫలితాల ప్రకారం.. సుమారు 4.2లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులు (ప్రశ్నకు నాలుగు మార్కులు+ తప్పు రాసినందుకు ఒక నెగెటివ్‌ మార్క్‌) కోల్పోయారు. దీంతో టాప్ ర్యాంక్ సాధించిన వారి సంఖ్యలో మార్పలు చోటు చేసుకున్నాయి.


జూన్ 4న విడుదల చేసిన NEET UG 2024 ఫలితాల్లో మొత్తం 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించి టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. ఈ ఫలితాలు సంచలనం సృష్టించాయి. అయితే, తాజా రివైజ్డ్ ఫలితాల్లో గతంలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారి సంఖ్య తగ్గింది. 44 మంది 5 మార్కులు కోల్పోవడంతో ర్యాంకర్ల జాబితా 67 నుంచి 17కు తగ్గింది.


Also Read:

Diksuchi: ఈఎస్‌సీఐలో పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌

Diksuchi : పుణె ఐఐటీఎంలో రీసెర్చ్‌ ఫెలో

Diksuchi : సీఆర్‌పీఎఫ్‌లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు

For More Education News and Telugu News..

Updated Date - Jul 25 , 2024 | 06:50 PM

Advertising
Advertising
<