ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Internship Scheme 2024: నేటి నుంచే పీఎం ఇంటర్న్‌షిప్ స్కీం రిజిస్ట్రేషన్

ABN, Publish Date - Oct 12 , 2024 | 10:00 AM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని ఇటివల ప్రారంభించారు. అయితే ఈ స్కీం దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి మొదలుకానుంది. దీని కోసం దరఖాస్తు చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏ మేరకు చదువుకోవాలనే ఇతర విషయాలను ఇక్కడ చుద్దాం.

PM Internship Scheme Registration

దేశంలోని యువత సిద్ధమా. నేటి నుంచి 24 ఏళ్లలోపు యూత్ కోసం పీఎం ఇంటర్న్‌షిప్ స్కీం రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. అయితే దీనికి దరఖాస్తు చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏ మేరకు చదువుకోవాలనే ఇతర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అర్హత

10, 12వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా లేదా BA, B.Sc., B.Com, BCA, BBA, B. ఫార్మా చదివిన 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువత దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం పోర్టల్ నేటి సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. దేశంలోని ప్రసిద్ధ 500 కంపెనీలలో ఇంటర్న్‌షిప్ చేయడానికి 21 నుంచి 24 ఏళ్ల వయస్సు గల యువత దీని కోసం అప్లై చేయవచ్చు. దీని ఇంటర్న్‌షిప్ వ్యవధి 12 నెలలు. ఇంటర్న్‌షిప్ వ్యవధిలో కనీసం సగం తరగతి గదిలో కాకుండా వాస్తవ పని అనుభవం లేదా ఉద్యోగ వాతావరణంలో గడపాల్సి ఉంటుంది.


ఇలా దరఖాస్తు

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద అర్హతగల అభ్యర్థులు pminternship.mca.gov.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ సమయంలో ప్రతి ఇంటర్న్ స్టైపెండ్‌గా రూ. 5000 పొందుతారు. ఇందులో రూ.4500 కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, రూ. 500 కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంబంధిత కంపెనీ ఇస్తుంది. ప్రతి ఇంటర్న్ కూడా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేయబడతారు.


ఎప్పటివరకు

అక్టోబర్ 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైన తర్వాత ఇది అక్టోబర్ 26 వరకు కొనసాగుతుంది. దీని తర్వాత అక్టోబర్ 27 నుంచి ఎంపికైన యువతకు ఇంటర్న్‌షిప్ చేయడానికి కంపెనీని కేటాయించనున్నారు. నవంబర్ 7వ తేదీలోపు జాబితాను విడుదల చేసిన తర్వాత, నవంబర్ 8 నుంచి 25వ తేదీ వరకు ఆఫర్ లెటర్లు పంపిస్తారు. ఆ తరువాత ఇంటర్న్‌లు డిసెంబర్ 2 నుంచి వారి సంబంధిత కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభిస్తారు. మొత్తం పథకంలో కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ విధానం వర్తిస్తుంది.


ఏ పత్రాలు కావాలంటే..

ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హత పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు చేస్తున్నప్పుడు అక్టోబర్ 11 నాటికి రిజిస్టర్ అయిన కంపెనీలలో ఇంటర్న్‌షిప్ కోసం ప్రతి ఇంటర్న్‌కు గరిష్టంగా ఐదు ఎంపికలు ఇవ్వబడతాయి.


ఈ రంగాల్లో అవకాశాలు

గత మూడేళ్ల CSR ఖర్చుల సగటు ఆధారంగా అగ్రశ్రేణి కంపెనీలను గుర్తించారు. గ్యాస్, చమురు, ఇంధన రంగానికి ఇంటర్న్‌షిప్ పథకంలో నమోదు కోసం గరిష్ట అవకాశాలు ఉన్నాయి. ఆ తరువాత టూర్-ట్రావెల్, హాస్పిటాలిటీ రంగంలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఉన్నాయి.


వీరికి నో ఛాన్స్

తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు లేదా కుటుంబ ఆదాయం రూ. 8 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు లేదా పూర్తి సమయం కోర్సులు చదువుతున్న యువకులు వీటికి దరఖాస్తు చేసుకోలేరు. IIT, IIM, నేషనల్ లా యూనివర్సిటీ, IISER, NIT, ట్రిపుల్ ఐటీ వంటి సంస్థల నుంచి డిగ్రీలు పొందిన యువత దరఖాస్తులు అంగీకరించబడవు. వృత్తిపరమైన డిగ్రీలు ఉన్నవారిని పథకం నుంచి దూరంగా ఉంచుతారు.


అప్రెంటిస్‌షిప్ చేసినా కూడా..

ఏదైనా స్కిల్ అప్రెంటిస్‌షిప్ ఇంటర్న్‌షిప్ చేసిన లేదా చేసిన యువత దరఖాస్తు చేయలేరు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి శిక్షణా కార్యక్రమంలో భాగమైన యువత ఈ పథకానికి అర్హులు కాదు. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద ఎప్పుడైనా అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన లేదా శిక్షణ పొందుతున్న యువత కూడా దరఖాస్తు చేయలేరు.


ఇవి కూడా చదవండి:

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన

Read More Education News and Latest Telugu News

Updated Date - Oct 12 , 2024 | 10:02 AM