ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

POLYCET 2024: రేపే పాలిసెట్ ఎగ్జామ్.. ఈ రూల్స్ తప్పనిసరి

ABN, Publish Date - May 23 , 2024 | 08:03 PM

రాష్ట్రంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET) 2024 నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 250 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 92,808 మంది అభ్యర్థులు హాజరుకానున్నాయి. ఈ క్రమంలో ఉదయం 11 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్ష హాలులోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు.

POLYCET 2024 exam tomorrow

రాష్ట్రంలో(Telangana) పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET) 2024 నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 250 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 92,808 మంది అభ్యర్థులు హాజరుకానున్నాయి. ఈ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించబడుతుంది. అయితే ఎగ్జామ్ ప్రారంభానికి ఒక గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్ష హాలులోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు.


దీంతోపాటు హాల్‌టికెట్‌పై ఫొటో రాని వారు పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. దీంతోపాటు పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావొద్దని అధికారులు తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ను మాత్రమే వెంట తీసుకెళ్లాలని సూచించారు. అంతేకాదు విద్యార్థులు Google Play స్టోర్‌లో SBTET అప్లికేషన్‌ డౌన్ లోడ్ చేసుకుని POLYCET పరీక్షా కేంద్రం లొకేటర్‌ ద్వారా కూడా మీ ప్రాంతాలను గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను సమర్పించడం ద్వారా తమ కేంద్రాలను గుర్తించవచ్చన్నారు.


వ్యవసాయం, పశువైద్యం, ఉద్యానవనాలలో డిప్లొమాతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో మూడేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి ఈ పాలిసెట్ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఇంకా అభ్యర్థులెవరైనా హాల్ టికెట్ డౌల్ లోడ్ చేసుకోకుంటే TS POLYCET అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

For More Education News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 08:07 PM

Advertising
Advertising