Group 1 Prelims Exam: రేపే గ్రూప్ 1 ఎగ్జామ్..ఈ రూల్స్ అస్సలు మరువొద్దు
ABN, Publish Date - Jun 08 , 2024 | 09:19 AM
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రేపు (జూన్ 9న) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను(group 1 prelims exam) నిర్వహించనుంది. జూన్ 9న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రేపు (జూన్ 9న) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను(group 1 prelims exam) నిర్వహించనుంది. జూన్ 9న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఈ సమయం తర్వాత ఆలస్యంగా వచ్చే వారికి ప్రవేశానికి అనుమతి ఉండదని అధికారులు సూచించారు. దీంతోపాటు ఈ ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు బూట్లు ధరించకుడదు, చప్పల్స్ మాత్రమే వేసుకోవాలి
బయోమెట్రిక్ వేలిముద్ర వివరాల రికార్డింగ్ ఉన్న క్రమంలో అభ్యర్థులు తమ వేళ్లపై మెహెందీ లేదా ఏదైనా ఇతర ప్రింటెడ్ రంగులు ఉంచుకోరాదు
కాలిక్యులేటర్‌లు, పేజర్‌లు, సెల్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, గడియారాలు తీసుకురావడం నిషేధం
లాగ్ బుక్‌లు, లాగ్ టేబుల్‌లు, వాలెట్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, పౌచ్‌లు, రైటింగ్ ప్యాడ్‌లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్‌లు, ఆభరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా తీసుకురావద్దు
ఐడీకార్డు, హాల్ టిక్కెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని, హాల్ టికెట్ ఫోటో సరిగా లేకుంటే మరొక ఫోటో తెచ్చుకోవాలని అధికారులు సూచించారు
ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు
TSPSC గ్రూప్ 1 సర్వీస్‌లోని 563 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయితీ రాజ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వంటి పోస్టులుంటాయి.
ఇవి కూడా చదవండి..
Ramoji Rao: రామోజీ రావు గురించి ఆసక్తికర విషయాలు
Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.
For More Education News and Telugu News..
Updated Date - Jun 08 , 2024 | 09:25 AM