ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS EAPCET Results: టీఎస్‌ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చూడొచ్చు..

ABN, Publish Date - May 18 , 2024 | 11:25 AM

హైదరాబాద్‌, మే 18: టీఎస్‌ఎప్‌సెట్‌(TS EAPCET Results) ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు.

TS EAPCET Results

హైదరాబాద్‌, మే 18: టీఎస్‌ఎప్‌సెట్‌(TS EAPCET Results) ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎప్‌సెట్‌ పరీక్ష లు రాసిన అభ్యర్థులు తమ ఫలితాలకు సంబంధించిన ర్యాంకు కార్డులను టీఎస్‌ఎప్‌సెట్‌ వెబ్‌సైట్‌(eapcet.tsche.ac.in) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 7 నుంచి 11 వరకు జరిగిన ఈఏపీసెట్ (ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ) పరీక్షలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి సుమారు 3.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.


ఎంతమంది ఉత్తీర్ణత సాధించారంటే..

అగ్రికల్చర్, ఫార్మసీలో 88.25% బాలురు, 90 18% బాలికలు ఉతిర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌లో 74 38% బాలురు, 75.85% బాలికలు ఉత్తిర్ణత సాధించారు. రెండు విభాగాల్లోనూ బాలురే టాప్‌లో ఉన్నారు.

తెలంగాణలో ఇదే మొదటి ఈఏపీసెట్. కాగా, ఈ పరీక్షకు అగ్రికల్చర్ , ఫార్మ విబాగాలకు 91,633 మంది విద్యార్థులు హాజరవగా.. వీరి శాతం 91.24 శాతం ఉంది. ఇంజనీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా మొత్తం ఈఎపీసెట్ కి 3,32,251 మంది విద్యార్థులు హాజరయ్యారు.


ఇంజినీరింగ్‌లో టాప్ ర్యాంకర్స్ వీరే..

టీఎస్‌ఎప్‌సెట్‌‌ ఫలితాల్లో ఇంజనీరింగ్‌ విభాగంలో తొలి 9 ర్యాంకులను అబ్బాయిలు కైవసం చేసుకున్నారు. ఇందులో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించారు. టాప్ 10 ర్యాంక్‌లో ఒక్క అమ్మాయి మాత్రమే నిలిచింది. ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ సతివాడ జ్యోతిరాదిత్య - శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్, రెండవ ర్యాంక్ గొల్ల లేఖ హర్ష - కర్నూల్, ఆంధ్రప్రదేశ్, మూడవ ర్యాంక్ రిషి శేఖర్ శుక్ల సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్‌ టెన్‌లో ఒక్క అమ్మాయి మాత్రమే నిలిచింది. ధనుకొండ శ్రీనిధి - విజయనగరం, ఆంధ్రప్రదేశ్ 10వ ర్యాంక్ సాధించింది.

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాప్ ర్యాంకర్స్ వీరే..

  • 1st rank - ఆలూర్ ప్రణిత - మదనపల్లి, అంధ్రప్రదేశ్

  • 2nd rank - నాగుడసారి రాధా కృష్ణ - విజయనగరం, అంధ్రప్రదేశ్

  • 3rs rank - గడ్డం శ్రీ వర్షిణి - వరంగల్, తెలంగాణ

For More Education News and Telugu News..

Updated Date - May 18 , 2024 | 11:52 AM

Advertising
Advertising