AP Election 2024: పోలింగ్ అనంతరం హింసపై దర్యాప్తునకు 13 మందితో కమిటీ ప్రకటన
ABN, Publish Date - May 17 , 2024 | 09:37 PM
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 13 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 13 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. సీఐడీ, ఏసీబీలో ఉన్న అధికారులతో ఈ బృందాన్ని ఈసీ ఏర్పాటు చేసింది. పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక సంఘటనలపై కూడా ఈ కమిటీ దర్యాప్తు జరపనుంది. ఇప్పటికే నమోదైన కేసుల పరిస్థితిని సమీక్షించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కేసుల్లో అదనపు సమాచారం వస్తే ఎఫ్‌ఐఆర్‌లో అదనపు సెక్షన్ల కింద నమోదు చేయాలని ఈసీ స్పష్టం చేసింది. దర్యాప్తును సమీక్షించి అవసరమైతే అదనపు చర్యలుకు సిఫార్సు చేయాలని ఆదేశించింది. అవసరమైతే తాజా ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయాలని సూచించింది. దర్యాప్తు నివేదికను తమకు అప్పగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Updated Date - May 17 , 2024 | 09:37 PM