ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amith Shah: పోలింగ్ తేదీ వరకు ఆ వాతావరణాన్ని కొనసాగించాలి

ABN, Publish Date - May 02 , 2024 | 07:13 AM

రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. సర్వేల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా గణనీయంగా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతోందన్నారు. 5, 6, 7 తేదీలలో నేతలంతా ఇంటింటికీ తిరగాలన్నారు. 12 సీట్లలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని అమిత్ షా తెలిపారు.

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Shah) దిశానిర్దేశం చేశారు. సర్వేల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా గణనీయంగా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతోందన్నారు. 5, 6, 7 తేదీలలో నేతలంతా ఇంటింటికీ తిరగాలన్నారు. 12 సీట్లలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని అమిత్ షా తెలిపారు. పోలింగ్ తేదీ వరకు ఆ వాతావరణాన్ని కొనసాగించాలన్నారు. జాతీయ, రాష్ట్ర నేతలతో 30 బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రధాని మోదీ రెండు రోజులలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్నారని అమిత్ షా తెలిపారు.

CM Revanth: నా గడ్డ మీద నన్నే బెదిరిస్తావా.. రేవంత్ మాస్ వార్నింగ్


ముఖ్యమంత్రులు యోగీ ఆదిత్యా నాథ్ , హిమంత విశ్వ శర్మలతో పాటు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని వెల్లడించారు. ప్రతి ఓటరును కలిసేలా నియోజకవర్గ ఇన్‌చార్జిలు, కన్వీనర్‌లు పనిచేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అమిత్ షా పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మరోసారి మోదీని ప్రధానిని చేయడం వల్ల కలిగే లబ్దిని కూడా ప్రజలకు వివరించాలని అమిత్ షా పేర్కొన్నారు. కాగా అమిత్ షా తెలంగాణలో మొత్తం ఐదు సభల్లో పాల్గొననున్నారు.

బజ్జీలు మీకు.. ఓట్లు నాకు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 02 , 2024 | 07:13 AM

Advertising
Advertising