AP Election 2024: టీడీపీకి ఓటు వేశానని చెప్పినందుకు దారుణానికి తెగబడ్డారు.. విశాఖలో షాకింగ్ ఘటన
ABN, Publish Date - May 17 , 2024 | 04:45 PM
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ అనంతరం కూడా వైసీపీ మూకలు కొనసాగించిన ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో ఒక దారుణం వెలుగుచూసింది. ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పిన ఓ కుటుంబంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ మేరకు బాధితులు సుంకర ధనలక్ష్మి, ఆమె కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠ మీడియా వేదికగా తెలిపారు.
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ అనంతరం కూడా వైసీపీ మూకలు కొనసాగించిన ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో ఒక దారుణం వెలుగుచూసింది. ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పిన ఓ కుటుంబంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ మేరకు బాధితులు సుంకర ధనలక్ష్మి, ఆమె కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠ మీడియా వేదికగా తెలిపారు. విశాఖ నార్త్ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుతో కలిసి బాధితులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ 49వ వార్డు పరిధిలో ఉన్న బర్మా క్యాంప్ వద్ద వైకాపా నేత అనుచరులు దాడి చేశారని వెల్లడించారు. లోకేశ్, భాస్కర్, భూలోక్, సాయి సహా పలువురు వ్యక్తులు దాడి చేశారమని, మద్యం మత్తులో తమ కుటుంబంపై చేశారని పేర్కొన్నారు.
బొగ్గు శ్రీను అనే వ్యక్తి వల్ల గొడవలు జరుగుతున్నాయని, అతడిని అరెస్ట్ చేయాలని బాధితురాలు నూకరత్నం అన్నారు. తమ ఇంటికి వచ్చి గొడవ పడ్డారని, తిరిగి తమపైనే దాడి చేశారని వాపోయారు. కొందరు వ్యక్తులు వచ్చి తన తల, కాళ్లపై కొట్టారని, 24 కుట్లు పడ్డాయని, భుజం దగ్గర ఎముక క్రాక్ కూడా వచ్చిందని నూకరత్నం పేర్కొన్నారు. తన చెల్లి గర్భిణి అని కూడా చూడకుండా ఆమె కడుపుపై రెండుసార్లు తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేయడంతో రాత్రి 10 గంటలకు పోలీసులు వచ్చి కొందరి తీసుకెళ్లారని, మరికొందర్ని విడిచిపెట్టినట్టుగా తెలుస్తోందని ఆమె అన్నారు.
బొగ్గు శ్రీను కేంద్రంగా ఈ వ్యవహారాన్ని నడిపారని అనుమానం ఉందని విశాఖ నార్త్ కూటమి అభ్యర్థి విష్ణు కుమార్ రాజు సందేహం వ్యక్తం చేశారు. బొగ్గు శ్రీనుని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అతడిపై చాలా రౌడీషీట్లు కూడా ఉన్నాయని, పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ గూండాలకు పోలీసులు సపోర్ట్ ఇస్తు్న్నారని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
Raghurama: కూటమికి 125 సీట్లు పక్కా: రఘురామకృష్ణంరాజు
AP Elections: జగన్‌కు దెబ్బ.. చెల్లెళ్లకు ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 17 , 2024 | 05:06 PM