ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: నేడు తెనాలిలో చంద్రబాబు నాయుడు పర్యటన

ABN, Publish Date - Apr 30 , 2024 | 08:45 AM

ఏపీలో ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ప్రధాన పార్టీల అధినేతలంతా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిత్యం ఏదో ఒక సభ పేరుతో జనం మధ్యే ఉంటున్నారు. నేడు తెనాలిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 5 గంటలకు ఆయన తెనాలి రానున్నారు.

గుంటూరు: ఏపీలో ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ప్రధాన పార్టీల అధినేతలంతా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిత్యం ఏదో ఒక సభ పేరుతో జనం మధ్యే ఉంటున్నారు. నేడు తెనాలిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 5 గంటలకు ఆయన తెనాలి రానున్నారు. సాయంత్రం 6 గంటలకు మార్కెట్ సెంటర్ వద్ద బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

తెలంగాణ నుంచి లోక్‌సభ బరిలో 525 మంది!


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న డోన్‌, నందికొట్కూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడమే కాకుండా.. భారీగా దోచేశాడని.. తిన్నదంతా కక్కిస్తామన్నారు. మైనింగ్‌లను మింగేసి కోట్ల రూపాయలు అప్పనంగా సంపాదించాడని విమర్శించారు. మంత్రి మాత్రమే కాకుండా ఆయన బంధువు గజేంద్రరెడ్డి సైతం నియోజకవర్గంలో భారీగా దోపిడీలకు పాల్పడ్డారని చంద్రబాబు విమర్శించారు. క్రషర్లు, మైనింగ్‌ గనుల్లో సెటిల్‌మెంట్లతో మంత్రి అనుచరులు, బంధువులు ఇష్టారాజ్యంగా దందాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.

Supreme Court: ఇసుక తవ్వకాలపై సుప్రీం ఫైర్.. నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం

AP Elections: కూటమి మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్

Read Latest AP News and Telugu News

Updated Date - Apr 30 , 2024 | 08:46 AM

Advertising
Advertising