Loksabha Polls: హైదరాబాద్ వీసా అప్లికేషన్ కేంద్రం మే 13న క్లోజ్.. ఎందుకంటే..?
ABN, Publish Date - Apr 13 , 2024 | 07:11 PM
విద్యార్థులు, ఉద్యోగార్థులకు గమనిక. మే 13వ తేదీన హైదరాబాద్ వీసా అప్లికేషన్ కేంద్రం మూసి ఉంటుంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. పొరుగన గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. ఎన్నికలు ఉన్నందున ఆ రోజు హైదరాబాద్ వీసా అప్లికేషన్ కేంద్రం మూసి వేసి ఉంటుంది.
హైదరాబాద్: విద్యార్థులు, ఉద్యోగార్థులకు గమనిక. గ్రీస్ వెళ్లాలని అనుకునేవారికి అలర్ట్. మే 13వ తేదీన హైదరాబాద్ (Hyderabad) వీసా అప్లికేషన్ కేంద్రం మూసి ఉంటుంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. పొరుగన గల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో లోక్ సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. ఎన్నికలు ఉన్నందున ఆ రోజు హైదరాబాద్ వీసా అప్లికేషన్ కేంద్రం మూసి వేసి ఉంటుంది. ఈ మేరకు గ్రీస్ గ్లోబల్ వీసా కేంద్రం అధికారిక ప్రకటన చేసింది.
Hyderabad: కాయ్ రాజా కాయ్.. ఆన్ లైన్ లో జోరుగా బెట్టింగ్.. కట్ చేస్తే..
‘ప్రియమైన దరఖాస్తు దారులారా.. హైదరాబాద్‌లో గల వీసా అప్లికేషన్ కేంద్రం మే 13వ తేదీన సోమవారం మూసి వేసి ఉంటుంది. ఏపీ, తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో క్లోజ్ చేసి ఉంటుంది. ఆ మరుసటి రోజు మంగళవారం సెంటర్‌లో సేవలు అందుబాటులో ఉంటాయి. గ్రీస్ దేశానికి వెళ్లాలని అనుకునే వారు ఈ విషయం గమనించగలరు. మీ ప్రణాళికను ఇందుకు అనుగుణంగా మార్చుకోగలరు అని’ వీసా కేంద్రం ప్రకటనలో తెలిపింది.
TG Politics: అందుకే ఫోన్ ట్యాపింగ్.. సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఏప్రిల్ 19వ తేదీన తొలి విడత పోలింగ్ ప్రారంభం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 7 ఫేజుల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తారు. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఆ రోజున మద్యాహ్నం వరకు ట్రెండ్ తెలిసి పోతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
Updated Date - Apr 13 , 2024 | 07:11 PM