ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: ఇది నా ఆస్తి అని మనం రుజువు చేసుకోవాలా?.. జగన్‌పై మండిపడ్డ పవన్

ABN, Publish Date - Apr 29 , 2024 | 12:58 PM

Andhrapradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, రోడ్‌ షోలలో పాల్గొంటున్నారు. సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి.దొంతమూరు వెల్దుర్తి సెంటర్లో ప్రజలను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తూ.. వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Janasena Chief Pawan Kalyan Road Show

కాకినాడ, ఏప్రిల్ 29: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఎన్నికల ప్రచారంలో (Election Campaign) బిజీబిజీగా గడుపుతున్నారు. పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, రోడ్‌ షోలలో పాల్గొంటున్నారు. సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి.దొంతమూరు వెల్దుర్తి సెంటర్లో ప్రజలను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తూ.. వైసీపీపై (YSRCP) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పట్టాదారుల పుస్తకాలపై జగన్ ఫోటోను ముద్రిచడంపై జనసేనాని ఫైర్ అయ్యారు.

AP Elections: రేపే కూటమి మేనిఫెస్టో.. ఎలా ఉండనుందో?


మన భూముల పట్టాదారు పాసుపుస్తకాలపై రాజముద్ర ఉండాలి గాని జగన్ ఫోటో ఏమిటి అని ప్రశ్నించారు. ‘‘ఇక దస్తావేజులు ఉండవట అన్నీ సర్వర్లో ఉంటాయట. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మన అందరి ఆస్తులుపోతాయి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది నా ఆస్తి అని మనం రుజువు చేసుకోవాలా’’ ఇదెక్కడి న్యాయం అంటూ విరుచుకుపడ్డారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకే దిక్కు లేనప్పుడు ఎస్సైన్డ్ డి ఫారం పట్టా భూములను వైసీపీ నాయకులు మిగులుస్తారా అని అన్నారు.


ప్రభుత్వ ఆస్తులు, వనరులు అన్నింటిని సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి, ద్వారంపూడి లాంటి వారికి జగన్ పంచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకానికి నిధులు లేవంటూ పంటలు ఎండబెడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నామని.. అరటి తొక్క లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో పడేద్దాం అంటూ పిలుపునిచ్చారు. ఏలేరు సుద్ధగడ్డ ఆధునీకరణ బాధ్యత తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

Komatireddy Rajagopal Reddy: బీఆర్ఎస్ పాలనలో జోకర్ గాళ్లు, బ్రోకర్ గాళ్లెక్కువ...

Chandrababu: నేడు డోన్, నందికొట్కూరులో చంద్రబాబు ప్రజాగళం..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 05:05 PM

Advertising
Advertising