ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Karnataka: కాంగ్రెస్‌లో అసమ్మతి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తిరుగుబాటు

ABN, Publish Date - Mar 27 , 2024 | 02:55 PM

లోక్ సభ ఎన్నికల టికెట్ల కేటాయింపు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాల రేపింది. మంత్రి కేహెచ్ మునియప్ప కుటుంబ సభ్యులకు కోలార్ లోక్ సభ టికెట్ ఇవ్వడంతో తీవ్ర దుమారం రేపింది. కోలార్ లోక్ సభ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మునియప్ప కుటుంబానికి పార్టీ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆగ్రహంతో ఉన్నారు.

బెంగళూర్: లోక్ సభ ఎన్నికల టికెట్ల కేటాయింపు కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ పార్టీలో (Congress) అసమ్మతి జ్వాల రేపింది. మంత్రి కేహెచ్ మునియప్ప కుటుంబ సభ్యులకు కోలార్ (Kolar) లోక్ సభ టికెట్ ఇవ్వడంతో తీవ్ర దుమారం రేపింది. ‘ఇక్కడ మంత్రి మునియప్ప బానిసలం కారు. కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్లను కేటాయించడం సరికాదు. పార్టీలో ఇతరులకు టికెట్ కేటాయించాలి. ఇదే అంశంపై సీఎం సిద్దరామయ్యను కలిసి వివరిస్తాం. మునియప్పతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. షెడ్యూల్ కులాలకు ప్రాతినిధ్యం లభించడం లేదని భావన నియోజకవర్గంలో నెలకొంది. కోలార్‌లో మునియప్ప కుటుంబం నుంచి కాకుండా ఇతర అభ్యర్థిని బరిలోకి దింపాలి అని’ అసమ్మతి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తరఫున మరో మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ (Sudhakar) మాట్లాడారు.

ఎమ్మెల్యేల అసంతృప్తి

కోలార్ లోక్ సభ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మునియప్ప కుటుంబానికి పార్టీ అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ ఇలా చేయడం తగదని, తీరు మార్చుకోవాలని కోరుతున్నారు. లేదంటే తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. పార్టీ హైకమాండ్ తన డిమాండ్లను వింటుంది కానీ పరిష్కరించడం లేదంటున్నారు.

మునియప్ప కుటుంబానికి టికెట్

17 మంది సభ్యులతో కర్ణాటక లోక్ సభ రెండో విడత జాబితా ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఐదుగురు మంత్రుల వారసులకు టికెట్లను కేటాయించారు. ఆ జాబితాలో కోలార్ కూడా ఉంది. అక్కడ మునియప్ప వారసుడికి టికెట్ ఇవ్వడాన్ని ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారు.

మరిన్ని లోక్ సభ ఎన్నికల వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

PM Modi: నువ్వో శక్తిస్వరూపిణివి.. ఓ అరాచకవాదిని జైలుకు పంపావ్‌!

Updated Date - Apr 05 , 2024 | 03:28 PM

Advertising
Advertising