Loksabha Polls: 2029 నుంచి ఓకే దేశం.. ఓకే ఎన్నిక.. అమిత్ షా ఏమన్నారంటే..?
ABN, Publish Date - Apr 19 , 2024 | 09:47 PM
ఓకే దేశం ఓకే ఎన్నిక అంశంపై బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ అనేది కొత్తది ఏం కాదన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండు దశాబ్దాల పాటు ఓకే దేశం ఓకే ఎన్నిక కొనసాగిందని గుర్తుచేశారు. 1971లో ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లడంతో సమస్య వచ్చిందని పేర్కొన్నారు.
ఢిల్లీ: ఓకే దేశం ఓకే ఎన్నిక అంశంపై బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ అనేది కొత్తది ఏం కాదని స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండు దశాబ్దాల పాటు ఓకే దేశం ఓకే ఎన్నిక కొనసాగిందని గుర్తుచేశారు. 1971లో ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లడంతో సమస్య వచ్చిందని పేర్కొన్నారు. అప్పటినుంచి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతున్నాయని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఎప్పుడూ జరగాలనే అంశంపై ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కోరారు.
PM Modi: సభ మధ్యలో తల్లి ఫోటో చూసి మోదీ భావోద్వేగం
వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి తమ పార్టీ కమిటీ ఏర్పాటు చేసిందని, కమిటీ రాజకీయ పార్టీలను సంప్రదించి నివేదిక కూడా సమర్పించిందని తెలిపారు. జడ్జీలు, న్యాయ సలహాదారులు ఓకే దేశం ఓకే ఎన్నిక నిర్వహించాలని అభిప్రాయ పడ్డారని గుర్తుచేశారు. ఓకే దేశం ఓకే ఎన్నికల వల్ల స్థానిక ఎన్నికలను జాతీయం చేయాలని బీజేపీ భావిస్తోందనే విపక్షాల ఆరోపణలను అమిత్ షా ఖండించారు.
‘విపక్షాలు ఆరోపణలు నిరాధారం. ఇలా మాట్లాడి మీరు ప్రజలను చిన్నచూపు చూస్తున్నారా..? కాంగ్రెస్ పార్టీకి ప్రజల హృదయాల్లో స్థానం లేదు. అలాంటప్పుడు అభివృద్ధిని ఆపేందుకు ఎందుకు ప్రయత్నిస్తారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరికీ ఓటు వేయాలో ప్రజలకు తెలుసు. రెండు బ్యాలెట్ బాక్సులు ఉంటాయి. విభిన్నమైన అభ్యర్థులు ఉంటారు. ఎన్నికల మేనిఫెస్టో కూడా వేరుగా ఉంటుంది. అలాంటి సమయంలో కన్ఫ్యూజన్ ఎందుకు అని’ అమిత్ షా ప్రశ్నించారు.
Pinarayi Vs Rahul: జైళ్ల పేరుతో మమ్మల్ని భయపెట్టొద్దు... రాహుల్‌కు కేరళ సీఎం పంచ్
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 19 , 2024 | 09:47 PM