ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls: నెరవేర్చలేని వాగ్ధానాలు.. బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్, ఆప్ విమర్శలు

ABN, Publish Date - Apr 14 , 2024 | 02:21 PM

బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ మేనిఫెస్టో రూపొందించిందని, నెరవేర్చలేని వాగ్దానాలను ఇచ్చిందని కాంగ్రెస్, ఆప్ మండిపడ్డాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అని, పంటకు కనీస మద్దతు ధర పెంచుతామని వాగ్దానం చేశాయి. గత పదేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డాయి.

Congress, AAP Criticise BJP Modi Ki Guarantee Manifesto

ఢిల్లీ: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ (BJP) భావిస్తోంది. మరోసారి అధికారం ఇస్తే చేపట్టే పనుల గురించి మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ మేనిఫెస్టోపై విపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి.

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..


‘ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ మేనిఫెస్టో రూపొందించింది. నెరవేర్చలేని వాగ్దానాలను బీజేపీ ఇచ్చింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అన్నారు. పంటకు కనీస మద్దతు ధర పెంచుతామని వాగ్దానం చేశారు. గత పదేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఉద్యోగాల కోసం యువత ఎదురు చూస్తున్నారు. ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతుంది. వాటి గురించి ప్రధాని మోదీ ఆందోళన చెందడం లేదు. గత పదేళ్లలో పేదల కోసం మోదీ ప్రభుత్వం చేసిందేమి లేదు. బీజేపీ మేనిఫెస్టో నమ్మదగినట్టు లేదు అని’ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.

BJP: అందుకే వారిని విధుల నుంచి తొలగించాలి..: లంకా దినకర్


గత పదేళ్లలో ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. దేశంలో ఉద్యోగం కోసం యువత ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ బడ్జెట్ కన్నా ఆయుష్మాన్ భారత్ బడ్జెట్ తక్కువ. ఢిల్లీ కోసం రూ.9 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. ఆయుష్మాన్ భారత్ కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. నేను పని చేశానని అనుకుంటే ఓటు వేయండి, లేదనుకుంటే వేయొద్దని అరవింద్ కేజ్రీవాల్ అంటారు. ఆ విధంగా మోదీ అడగలరా అని’ ఆప్ నేత, మంత్రి ఆతిషి ప్రశ్నించారు.

Purandeswari: ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి లేఖ.. కారణమిదే..?

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 14 , 2024 | 02:27 PM

Advertising
Advertising