ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls: రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

ABN, Publish Date - May 03 , 2024 | 08:00 AM

జాతీయ రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

న్యూఢిల్లీ: జాతీయ రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అన్ని ఊహాగానాలకు తెరదించుతూ రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం వెల్లడించింది. చాలా చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అమేథీ నుంచి సీనియర్ నాయకుడు, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న కిషోరి లాల్ శర్మ పేరుని పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం పేర్లను వెల్లడిచింది.


ఈ రోజు నామినేషన్..

నామినేషన్లకు నేడు చివరి తేదీ కావడంతో రాహుల్ గాంధీ నేడు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. రాయ్‌బరేలి నుంచి ఇప్పటివరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. నెహ్రూ - గాంధీ కుటుంబ నేతలు యూపీని వదిలిపెడితే కాంగ్రెస్ విజయావకాశాలపై ప్రభావం పడుతుందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే రాహుల్ గాంధీని అక్కడి నుంచి బరిలోకి దింపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ లో సోనియాగాంధీ గెలిచారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రత్యక్ష ఎన్నికలకు ఆమె దూరమయ్యారు.

ఇటీవలే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియాగాంధీ ఎన్నికయ్యారు. దీంతో రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. రెండో విడత పోలింగ్‌లో భాగంగా ఇక్కడ ఎన్నికలు ముగిశాయి.

ఇవి కూడా చదవండి

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌.. కేసీఆర్‌ కోసమే!

Viral Video: చివరి బంతికి SRH విక్టరీ.. ఎగిరి గంతేసిన కావ్య మారన్

For more Lok Sabha Polls news and Telugu News

Updated Date - May 03 , 2024 | 08:55 AM

Advertising
Advertising