Big Breaking: మార్చి 15న ఎన్నికలపై కీలక ప్రకటన చేయనున్న ఎన్నికల సంఘం..
ABN, Publish Date - Mar 09 , 2024 | 08:12 PM
Election Commission of india: సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేయనుంది. మార్చి 15వ తేదీన పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ(Election Commission of India) ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలతో(Lok Sabha Elections) పాటు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ(Assembly Elections) ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ను ప్రకటించనుంది ఎన్నికల సంఘం.
Election Commission of India: సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేయనుంది. మార్చి 15వ తేదీన పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ(Election Commission of India) ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలతో(Lok Sabha Elections) పాటు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ(Assembly Elections) ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ను ప్రకటించనుంది ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఇతర ఉన్నతాధికారుల బృందం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించారు.
ఈ నెల 11వ తేదీన ఎన్నికల పరిశీలకులతో సమావేశం కానుంది కేంద్ర ఎన్నికల సంఘం. సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకలతో ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 12, 13 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనుంది. 14వ తేదీన పూర్తిస్థాయిలో మరోసారి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించి.. ఆ తరువాత15వ తేదీన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 09 , 2024 | 08:12 PM