Lok Sabha polls 2024: మద్యం ప్రియులకు కీలక అప్‌డేట్.. రేపటి నుంచి..
ABN, Publish Date - May 10 , 2024 | 08:42 AM
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు-2024 పోలింగ్‌కి సమయం దగ్గర పడుతోంది. రేపు (శనివారం) ప్రచారపర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం ప్రియులను కాస్త నిరాశకు గురిచేసే కీలక అప్‌డేట్ వచ్చింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈనెల 13న పోలింగ్ జరగనున్నందున రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం (EC) నిషేధం విధించింది.
హైదరాబాద్ సిటీ, మే 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు-2024 పోలింగ్‌కి సమయం దగ్గర పడుతోంది. రేపు (శనివారం) ప్రచారపర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం ప్రియులను కాస్త నిరాశకు గురిచేసే కీలక అప్‌డేట్ వచ్చింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈనెల 13న పోలింగ్ జరగనున్నందున రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం (EC) నిషేధం విధించింది.
ఈనెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13న సాయంత్రం 6 గంటల వరకు రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను మూసివేయాలని ఎన్నికల సంఘం గురువారం ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్న సందర్భంగా ఆ రోజు కూడా మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఈసీ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈసీ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత సభలు, ర్యాలీలు, సమావేశాలపై నిషేధం విధించింది.
Updated Date - May 10 , 2024 | 10:17 AM