Loksabha Polls: కారును స్క్రాప్ కింద కాంటాకు పెట్టుడే: మంత్రి పొంగులేటి
ABN, Publish Date - Apr 27 , 2024 | 09:08 PM
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేరు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో గల పాలకులు జైలుకు వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో గల పాలకులు జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. కొత్తగూడెం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు గట్టి బుద్ది చెబుతారని మంత్రి పొంగులేటి అన్నారు. కారును తుక్కు స్క్రాప్ కింద కాంటాకు పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. బీజేపీ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం రెండుసార్లు వచ్చిన సోనియా గాంధీ చేపట్టలేదని గుర్తుచేశారు. ఇండియా కూటమిని అత్యధిక మెజారిటీ తో అధిక స్థానాల్లో గెలిపించాలని శ్రేణులను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 నుంచి15 సీట్లు గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
‘గత అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం సీపీఐ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో 9 గెలిచాం. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకు పైగా మెజారిటీ రావాలి. బీఆర్ఎస్ పాలకులకు గత పదేళ్ల నుంచి గుర్తుకు రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు రోడ్డుమీదకు వచ్చాడు. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు అని’ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం
Read Latest Telangana News or Telugu News
Updated Date - Apr 27 , 2024 | 09:08 PM