ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Polls: సందేశ్ ఖాళి బాధితురాలికి భద్రత

ABN, Publish Date - Apr 30 , 2024 | 08:35 AM

పశ్చిమ బెంగాల్‌ బసిర్షత్ బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. రేఖాకు ఎక్స్ క్యాటగిరీ ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. సందేశ్ ఖాళీలో నెలకొన్న హింస, లైంగిక దాడి, భూ ఆక్రమణల గురించి ప్రపంచానికి రేఖా పాత్ర తెలియ జేశారు. మాజీ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ అతని అనుచరుల ఆగడాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

BJP Candidate Rekha Patra

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) బసిర్షత్ బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. రేఖాకు ఎక్స్ క్యాటగిరీ ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. సందేశ్ ఖాళీలో నెలకొన్న హింస, లైంగిక దాడి, భూ ఆక్రమణల గురించి ప్రపంచానికి రేఖా పాత్ర తెలియ జేశారు. మాజీ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ అతని అనుచరుల ఆగడాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రధాని మోదీ బెంగాల్‌లో పర్యటించిన సమయంలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.


రేఖ పాత్రకు సెంట్రల్ ఇండస్ట్రీల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన కమాండోలు భద్రత కల్పిస్తారు. రేఖా పాత్ర ప్రాణానికి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ విభాగం కేంద్ర హోం శాఖకు నివేదించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్స్ క్యాటగిరీ భద్రత ఇస్తామని ప్రకటించింది. రేఖా పాత్రతో పాటు మరో ఐదుగురు బీజేపీ నేతలకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వనున్నారు.


ఝార్ గ్రామ్ అభ్యర్థి ప్రణత్, బారంపూర్ అభ్యర్థి నిర్మల్ సాహ, జయనగర్ నుంచి అశోక్ కందారి, మథురాపూర్ నుంచి అశోక్ పురకిత్‌కు ఎక్స్ క్యాటగిరీ భద్రత ఇస్తారు. రాయ్ గంజ్ బీజేపీ అభ్యర్థి కార్తీక్ పాల్‌కు కాస్త ఎక్కువ థ్రెట్ ఉంది. దాంతో వై క్యాటగిరీ భద్రతను అందజేస్తారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ నుంచి బెంగాల్ బీజేపీకి చెందిన 24 మంది అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. దేశవ్యాప్తంగా 100 మంది బీజేపీ అభ్యర్థులకు సీఐఎస్ఎఫ్ కమాండోల చేత భద్రత ఇస్తోంది.


Read Latest
Election News or Telugu News

Updated Date - Apr 30 , 2024 | 08:35 AM

Advertising
Advertising