PM Modi: సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష..!!
ABN, Publish Date - May 12 , 2024 | 11:05 AM
గత పదేళ్ల నుంచి చేసిన పనులే తిరిగి తమ ప్రభుత్వం ఏర్పడేందుకు దోహద పడుతుందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో అభివృద్ధి పడకేసింది. గత పదేళ్లలో దేశం ఎంతో ప్రగతి సాధించిందని వివరించారు.
గత పదేళ్ల నుంచి చేసిన పనులే తిరిగి తమ ప్రభుత్వం ఏర్పడేందుకు దోహద పడుతుందని ప్రధాని మోదీ (PM Modi) అభిప్రాయ పడ్డారు. ఓ వార్తా సంస్థ ప్రతినిధులతో ప్రధాని మోదీ మాట్లాడారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో దేశంలో అభివృద్ధి పడకేసింది. గత పదేళ్లలో దేశం ప్రగతిపథంలో ముందుకెళ్లింది. దేశంలో విమానాశ్రయాలు 74 నంచి 150కి చేరాయని, జాతీయ రహదారులు 91 వేల కిలోమీటర్ల నుంచి లక్ష 45 వేల కిలోమీటర్లకు చేరిందని వివరించారు. రక్షణ రంగానికి పెద్ద పీట వేశామని తెలిపారు. 21 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు.
దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందజేస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 50 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయిని వివరించారు. 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని పేర్కొన్నారు. గత పదేళ్లలో జరిగిన మార్పులను ప్రజలు గమనించారని పేర్కొన్నారు. అందుకోసమే తమ మేనిఫెస్టోలో ఉచితాల గురించి పేర్కొనలేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అందించిన పథకాల వల్ల మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో బీజేపీ సీట్లు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.
Read Latest Telangana News and National News
Updated Date - May 12 , 2024 | 11:06 AM