ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mallikarjuna Kharge: అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ రైడ్స్ ఏవి?

ABN, Publish Date - May 10 , 2024 | 01:54 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదని.. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఓడిపోయామనే బాధలోనే ప్రభుత్వం పడిపోతుందని కొందరు అంటున్నారని.. ఈ ఐదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని... అద్భుతమైన పాలన కొనసాగిస్తుందన్నారు. జనాభా లెక్కలను మోదీ బయట పెట్టడం లేదని.. అవి బయటపెడితే అన్ని విషయాలూ బయటకు వస్తాయన్నారు.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదని.. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) అన్నారు. ఓడిపోయామనే బాధలోనే ప్రభుత్వం పడిపోతుందని కొందరు అంటున్నారని.. ఈ ఐదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని... అద్భుతమైన పాలన కొనసాగిస్తుందన్నారు. జనాభా లెక్కలను మోదీ బయట పెట్టడం లేదని.. అవి బయటపెడితే అన్ని విషయాలూ బయటకు వస్తాయన్నారు. మోదీ హయాంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగడం లేదన్నారు. దేశాన్ని విడదీసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. మోదీ అబద్దాలపై అబద్ధాలు చెబుతున్నాడన్నారు. తెలంగాణలో ఇచ్చిన 5 గ్యారెంటీలు అమలు చేశామని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.

Bandi Sanjay: కేసీఆర్ ఏమైనా సుద్ద పూసా? వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా..


‘‘ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా హామీలను అమలు చేస్తాం. తెలంగాణలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. మేం కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నాం. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీని తిట్టడంపైనే బీజేపీ ఫోకస్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ భయపడుతోంది కాబట్టే తిడుతున్నారు. మటన్, మందిర్, మంగళ సూత్రం లాంటి అంశాలనే మోదీ మాట్లాడుతున్నారు. అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ సంస్థల రైడింగ్ ఎందుకు జరపడం లేదు? యువకులకు ఉద్యోగాలు తప్పకుండా కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టాం. తప్పకుండా చేస్తాం. షాం పిట్రోడా ఇప్పుడు మా పార్టీలో లేడు. మోదీ ప్రధాని పదవిలో ఉంటూ ఎప్పుడూ హుందాగా మాట్లాడలేదు. దేశాన్ని ఎవరూ విడదీయలేరు. ఓట్ల కోసం కొందరు దేశాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు’’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Hyd News: మద్యం ప్రియులకు కీలక అప్‌డేట్.. రేపటి నుంచి..

AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్‌ ‘వ్యూహం’

Read more Telangana News and Telugu News

Updated Date - May 10 , 2024 | 01:54 PM

Advertising
Advertising