ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLA Pinnelli: పోలీసులు వెంటపడడంతో కార్, డ్రైవర్, మొబైల్ వదిలేసి పరారైన పిన్నెల్లి

ABN, Publish Date - May 22 , 2024 | 04:34 PM

ఈవీఎంను పగలగొట్టిన కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు కూడా అదే రేంజ్ వేటాడుతున్నారు. పిన్నెల్లి కోసం అన్వేషణ కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

అమరావతి: ఈవీఎంను పగలగొట్టిన కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (Ramakrishna Reddy Pinnelli) విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు కూడా అదే రేంజ్ వేటాడుతున్నారు. పిన్నెల్లి కోసం అన్వేషణ కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.


ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నాడని, అయితే వ్యూహం బెడిసి కొట్టిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 1.20 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడని, అయితే మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉన్నప్పటికీ ఎయిర్‌పోర్ట్‌లో ఏపీ పోలీస్ టీమ్ మాటు వేసిందని తెలుసుకొని వెళ్లలేదని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా పోలీసులు ఎయిర్‌పోర్టులో ఉన్నారనే విషయం తెలుసుకున్న పిన్నెల్లి తప్పించుకునేందుకు రూట్ మార్చినట్టు తెలుస్తోంది.


కారు డ్రైవర్‌, గన్‌మెన్‌ అరెస్ట్?

రూట్ మార్చి మెదక్ వైపు వెళ్లారని సమాచారం. పిన్నెల్లి కదలికలను పోలీసులు ట్రాక్ చేస్తుండడంతో సంగారెడ్డి జిల్లా కంది వద్ద కారు, డ్రైవర్, మొబైల్‌ను వదిలేసి వేరే వాహనంలో పరారు అయ్యారని సమాచారం. దీంతో కారు డ్రైవర్‌, గన్‌మెన్‌లను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఆశ్రయం ఇచ్చినవారిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తునట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు

వెంటాడుతున్న పోలీసులు.. పిన్నెల్లి బ్రదర్స్ ప్లాన్ ఇదేనా..?

For more Election News and Telugu News

Updated Date - May 22 , 2024 | 04:35 PM

Advertising
Advertising