ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksbha polls: మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఏమీ లేదు.. ఖాళీ చెంబు తప్ప: రేవంత్

ABN, Publish Date - Apr 29 , 2024 | 02:52 PM

Telangana: కర్ణాటకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా గుర్మిట్కల్‌లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఎన్నికల ప్రచారసభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే కొనసాగారన్నారు. 1972లో మొదటిసారిగా ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే... ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.

Telangana CM Revanth Reddy Election Campaign

బెంగళూరు, ఏప్రిల్ 29: కర్ణాటకలో (Karnataka) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telanganan CM Revanth Reddy) పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా గుర్మిట్కల్‌లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో (AICC Chief Mallikarjuna kharge) కలిసి ఎన్నికల ప్రచారసభలో (Election Campaign) సీఎం పాల్గొని ప్రసంగించారు. ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే కొనసాగారన్నారు. 1972లో మొదటిసారిగా ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే... ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. ఇక్కడి ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.

Loksabha Polls 2024: ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అది కేసీఅర్.. కొండా సురేఖ విమర్శ


మోదీ ఏ హామీని నెరవేర్చలేదు...

ఐదు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వమన్నారు. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసుకున్నామని చెప్పుకొచ్చారు. పదేళ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారన్నారు. 40 కోట్ల ఖాతాలు తెరిపించిన మోదీ... ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదన్నారు. కర్ణాటక నుంచి 26 ఎంపీలను ఇస్తే... మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఒకటే కేబినెట్ పదవన్నారు. మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఏమీ లేదని.. ఖాళీ చెంబు తప్ప అంటూ విరుచుకుపడ్డారు.

AP Elections: వైసీపీ ఆశలన్నీ వాళ్లపైనే.. తేడా వస్తే ఫ్యాన్ ఫ్యూజులౌట్..


అవి కావాలంటే కాంగ్రెస్‌‌‌కు ఓటేయండి..

కరువు వస్తే కనీసం బెంగుళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. నరేంద్ర మోదీ ప్రజలను నమ్మించి మోసం చేశారని.. అలాంటి మోదీని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని కోరారు. సమర్ధుడు, ప్రజల కోసం కొట్లాడే వారికే ఓటువేసి గెలిపించాలన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఒక్క ఓటు వేస్తే... ఇక్కడున్న ముగ్గురు నాయకులు ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారన్నారు. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్నారు. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. లక్ష మెజారిటీతో ఇక్కడ కాంగ్రెస్ ను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.


ఇవి కూడా చదవండి...

JP Nadda: కాంగ్రెస్ పాలనలో స్కాంల విధ్వంసం.. బీఆర్ఎస్ పాలనలో అవినీతి

International Dance Day : డ్యాన్స్ అంటే బాగా ఇష్టమా? డ్యాన్స్ చేయడం వల్ల కలిగే 5 ఆరోగ్య లాభాలు ఇవే..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 05:02 PM

Advertising
Advertising