ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఐదు నెలల్లోనే పదేళ్ల వ్యతిరేకత.. మంత్రి కిషన్‌రెడ్డి..

ABN, Publish Date - May 05 , 2024 | 06:11 AM

రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం బీజేపీకి లేదని, పైగా రాజ్యాంగానికి తాము మరింత గౌరవం తెస్తామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ పాలనను ప్రజలు హర్షించడం లేదు.. ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం బీజేపీకి లేదని, పైగా రాజ్యాంగానికి తాము మరింత గౌరవం తెస్తామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిననే విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని, ఆయనను, ఆయన పార్టీని ప్రజలే తరిమి కొడతారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన తరువాత వ్యతిరేకతను తెచ్చుకుంటే.. కాంగ్రెస్‌ ఐదు నెలల్లోనే పదేళ్ల వ్యతిరేకతను తెచ్చుకుందని ఆరోపించారు.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ముఖ్యమంత్రి తొండివాదన చేస్తున్నారని, హామీలపై రేవంత్‌వి దొంగ నాటకాలు అని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఒక్క ఉచిత బస్సు హామీని అమలుచేసి.. దానిపైనే రిఫరెండం అంటారా? అని ఎద్దేవా చేశారు. రేవంత్‌ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని, ఐదేళ్ల తర్వాత ప్రజలే తరిమికొడతారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఒక్క సీటు కూడా రాదన్నారు. తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో బీజేపీని ఆదరిస్తారని, ఐదేళ్ల తరువాత రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.


ఐదు నెలల పాలనే తమ ఎజెండా, దానికి రిఫరెండమే ఈ ఎన్నికలని సీఎం రేవంత్‌ అంటున్నారు. మీ ఎజెండా ఏంటి?

అసలు ఏదైనా పని చేస్తే కదా రెఫరెండం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినంత మాత్రాన ఈ ఎన్నికల్లో అది కాంగ్రెస్‌ పరిపాలనకు రెఫరెండం అవుతుందా? ఆరు గ్యారంటీలపై సీఎం రేవంత్‌రెడ్డి దొంగ నాటకాలాడుతున్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక గ్యారంటీల కు సంబంధించి దేవుడిపై ఒట్లు పెడుతున్నారు. ఆయనకు ముందుంది ముసళ్ల పండగ. హామీలు అమలు చేయలేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఆయన చూడబోతున్నారు. తిట్ల రాజకీయం ఎన్ని రోజులు చేస్తారు? భూములమ్మితే ఎన్ని లక్షల కోట్లు వస్తాయి? ఇక మా ఎజెండా.. ప్రధాని నరేంద్రమోదీ పదేళ్లలో సాధించిన విజయాలు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేసిన సాయం. పదేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది. వందశాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టింది. హార్టికల్చర్‌ యూనివర్సిటీ, సమ్మక్క, సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ రెండో యూనిట్‌ ప్రారంభం, పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు తదితర ప్రాజెక్టులు చేపట్టాం. వీటిపైనే ఇంటింటికీ వెళ్తున్నాం. తెలంగాణను బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సల నుంచి విముక్తి చేయడమే మా లక్ష్యం.


రాజ్యాంగ మూలసూత్రాలను తుడిచేయడానికి బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది?

ఇది మా ఎజెండాలోనే లేదు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం మాకు లేదు. మరింత సమర్థంగా రాజ్యాంగాన్ని అమలుచేస్తాం. దాని గౌరవాన్ని కాపాడుతాం. మేం అధికారంలోకి వచ్చిన తరువాతనే కశ్మీర్‌లో రాజ్యాంగాన్ని అమలు చేశాం. అంబేడ్కర్‌ పంచతీర్థాలను అభివృద్ధి చేశాం. పార్లమెంట్‌లో ఆయన ఫొటో మేమే పెట్టాం. మా వల్లనే అంబేడ్కర్‌కు భారతరత్న వచ్చింది. మేం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్లం. మా పార్టీ ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. పార్టీకి నడ్డా అధ్యక్షుడుగా ఉన్నారు.. సామాన్య కార్యకర్త కూడా అధ్యక్షుడయ్యే అవకాశం బీజేపీ పార్టీలో ఉంది. మిగతా పార్టీలు కుటుంబ, వ్యక్తి పార్టీలు. ఇప్పటికే 15 మంది బీజేపీ అధ్యక్షులు అయ్యారు. మోదీని విమర్శించడానికి ఏమీ లేదు. వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులకు ఏమీ దొరక్క వితండవాదం చేస్తున్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రాజ్యాంగాన్ని రక్షిస్తానని, దానిని మార్చేందుకు ఎవరు ప్రయత్నించినా ఒప్పుకోనని ప్రధానమంత్రి చెప్పారు. ఇంతకంటే ఏం చెబుతారు?


కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని, బీఆర్‌ఎస్‌ కీలకం కాబోతోందని కేసీఆర్‌ అంటున్నారు?

మోదీ పోతాడు.. సంకీర్ణం వస్తుంది అని చెప్పడమంటే కాంగ్రె్‌సతో కలుస్తానని కేసీఆర్‌ ఒప్పుకొన్నట్లే కదా! ఆయన కాంగ్రె్‌సతో కలిశాడని ఇన్ని రోజులుగా మేం చెబుతున్నాం. ఇప్పుడు ఆయనే చెప్పారు. బీఆర్‌ఎ్‌సకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు. ఒకవేళ ఒకటీ అరా వచ్చినా.. దానివల్ల తెలంగాణకు ఒరిగేదేమీ ఉండదు. మేమైతే కేసీఆర్‌ను చేర్చుకోం. సంకీర్ణయుగానికి కాలం చెల్లింది.అసలు సంకీర్ణం అంటేనే బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు. అందుకే దేశ ప్రజలు సుస్థిర ప్రభుత్వం కావాలని ఆకాంక్షించారు. అందుకే రెండుసార్లు బీజేపీకి పట్టం కట్టారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేస్తుందని సీఎం కూడా అంటున్నారు?

మాకున్నది 8 సీట్లు. మేమెట్లా కూలుస్తాం? ఎవరు ఏమి మాట్లాడినా మాకు అనవసరం. మేం నాలుగున్నరేళ్లు ఆగుతాం. ప్రజాస్వామ్యబద్దంగా అధికారంలోకి వస్తాం. వాళ్ల పార్టీలో అంతర్గత అసమ్మతి వచ్చి రేవంత్‌రెడ్డిని గద్దె దింపే పరిస్థితి వస్తే మాత్రం ఆ ప్రభుత్వాన్ని కట్టెలు పెట్టి నిలపాల్సిన అవసరం కూడా మాకు లేదు.


బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బలమైన అభ్యర్థులను పోటీలో పెట్టలేదంటున్నారు కదా?

వాళ్లే పరస్పరం భిన్నంగా మాట్లాడుతున్నారు. అర్థం లేని ప్రశ్నలు, గందరగోళం కలిగించే ప్రకటనలు చేస్తున్నారు. నిరాధారమైన అంశాలకు మీడియా కూడా ప్రాధాన్యం ఇస్తోంది. రెండు పార్టీల నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ కలుస్తాయని రేవంత్‌ అన్నారు. అప్పుడు కలిశామా? ఇన్ని రోజులు మజ్లిస్‌ బీఆర్‌ఎ్‌సతో ఉంది.. ఇప్పుడు కాంగ్రె్‌సతో కలిసింది కదా! ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కేంద్రంలో మాకు సీట్లు తగ్గినా సరే.. బీఆర్‌ఎస్‌ మద్దతు తీసుకోం.


ఈ ఎన్నికలు గుజరాత్‌ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు అని సీఎం రేవంత్‌ అంటున్నారు?

ఇదేం పోలిక? అర్థం ఉందా? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో నువ్వు, నీ పార్టీ, నీ చరిత్ర ఏంటో చెప్పు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారు.. అమలు చేయకుండా ప్రజలు, రైతులు ప్రశ్నిస్తారని రేవంత్‌ తొండివాదన చేస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లే నైతికత వాళ్లకు లేదు. ఏం పౌరుషం? మొన్న మోదీ వేదిక మీద చిన్న అన్న, పెద్ద అన్న అన్నప్పుడు పౌరుషం లేదా? సీఎం దిగజారి మాట్లాడుతున్నారు. ఆయన ఇంకా సీఎం అని అనుకుంటున్నట్లు లేడు. టీఆర్‌ఎస్‌ పోవడానికి పదేళ్లు పట్టింది.. వచ్చే ఐదేళ్ల తర్వాత కాంగ్రె్‌సకు డిపాజిట్లూ రావు. గ్రామాల్లోకి వెళితే తరిమి కొడతారు..


రామాలయం పేరుతో మోదీ ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్‌ అంటోంది?

జాతీయ రహదారుల గురించి చెబుతున్నాం. రైల్వేల గురించి చెబుతున్నాం.. స్వచ్ఛ భారత్‌ గురించి చెబుతున్నాం. గ్యాస్‌ కనెక్షన్ల గురించి, ఎగుమతుల మీద, దేశ విదేశాల్లో దేశం ప్రతిష్ట పెంచిన అంశాన్ని చెబుతున్నాం. ఉగ్రవాదం గురించి చెబుతున్నాం.. గుడ్‌ గవర్నెన్స్‌ గురించి చెబుతున్నాం.. కుటుంబ పాలన గురించి, జమ్ముకశ్మీర్‌లో శాంతిని పునరుద్ధరించామని, అవినీతి గురించి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల గురించి ఇలా అనేక అంశాలు చెబుతున్నాం.. రామాలయం ఒక్కటే కాదు కదా! ఇవన్నీ పోయినట్టేనా? మాకు చెప్పడానికి అన్నీ ఉన్నాయి. యూపీఏ పదేళ్ల కాలంలో ఏం చేశారో, మోదీ పదేళ్లలో ఏం చేశారనేదానిపై చర్చకు వస్తారా?


తెలంగాణలో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు?

ఎన్నికల్లో మాది మొదటి స్థానం. మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌. చాలా చోట్ల బీఆర్‌ఎ్‌సది మూడో స్థానమేనన్నది నాకున్న సమాచారం.

గ్యారంటీలపై కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారంపై మీ అభిప్రాయం?

అసలు ఆపార్టీకి ఏమాత్రం నైతికత ఉన్నా అలాంటి ప్రచారం చేసుకోదు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు హామీలో దారుణంగా విఫలమైంది. కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిస్తున్నా. ముఖం చెల్లని కాంగ్రెస్‌ నాయకులు రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వందశాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తిచేసిన ప్రాజెక్టులను కూడా కాంగ్రెస్‌ తన ఖాతాలో ప్రచారం చేసుకుంటోంది.


మోదీ పాలనలో తెలంగాణకు గాడిద గుడ్డే ఇచ్చారని సీఎం ఆరోపిస్తున్నారు?

ఇప్పుడు ఆయన తన పార్టీ చేయి గుర్తు మానేసి గాడిద గుడ్డు నెత్తిమీద పెట్టుకుని ఊరూరా తిరుగుతున్నాడు. గాడిద గుర్తుకే ఓటు వేయండి అని ప్రచారం చేస్తున్నారు. ఆయన పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు ఏం చేశారో చర్చకు వస్తారా? నైతిక విలువలు లేకుండా మాట్లాడుతున్నారు.


పారాచూట్‌ నేతలకు ఎక్కువ స్థానాలు ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారు?

మా బలాన్ని పెంచుకోవడం కోసం అక్కడక్కడా కొత్తవాళ్లకు ఇచ్చాం. తప్పేముంది? అలా అంటే బీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థిని కాంగ్రెస్‌ వాళ్లు తీసుకువెళ్లి ఖరారు చేయడాన్ని ఏమనాలి? మేం అలా చేయలేదు కదా! ఇక్కడ మాది చిన్న పార్టీ.. పెరగాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో మా పార్టీ వాళ్లకు బోలెడు అవకాశాలున్నాయి. ఇస్తాం కూడా.

ఎస్సీ వర్గీకరణ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని, అందుకే మేనిఫెస్టోలో పెట్టలేదని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు?

ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత ఇంకా మేనిఫెస్టోలో ప్రస్తావన అవసరమా? అంతేకాదు.. కులగణనకు కూడా మేం వ్యతిరేకం కాదు. కరోనా కారణంగా నిలిచిపోయిన జనగణన పూర్తికావాల్సిందే.

Updated Date - May 05 , 2024 | 06:11 AM

Advertising
Advertising