AP Elections: రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్నికల మేనెజ్ మెంట్ కమిటీతో వీడియో కాన్ఫరెన్స్
ABN, Publish Date - Apr 17 , 2024 | 09:42 PM
ఆంధ్రప్రదేశ్‌లో సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. ఎన్నికల్లో ప్రచారం, కూటమితో కలిసి జనంలోకి వెళ్లే అంశాలపై నేతలకు అగ్ర నాయకత్వం నిర్దేశించింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ఎన్నికల మేనెజ్ మెంట్ కమిటీతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ (BJP) అనుకుంటోంది. ఎన్నికల్లో ప్రచారం, కూటమితో కలిసి జనంలోకి వెళ్లే అంశాలపై నేతలకు అగ్ర నాయకత్వం నిర్దేశించింది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ఎన్నికల మేనెజ్ మెంట్ కమిటీతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడిందని, మరింత కష్టపడాలని అరుణ్ సింగ్ కోరారు. ఏపీలో ఎన్డీఏ ప్రభావం ఉంది. కూటమి విజయం కోసం మరింత శ్రమించాలని సూచించారు.
ఎన్డీఎ నిర్వహించే సభలు విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సహ ఇంఛార్జీ సిద్దార్ధ్ నాద్ సింగ్ స్పష్టం చేశారు. నామినేషన్ల దశలో అహర్నిశలు పని చేయాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పొత్తులో కేటాయించిన సీట్లు మొత్తం గెలుచుకునే విధంగా పనిచేయాలని తేల్చి చెప్పారు. 175 నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులు తమ పార్టీ క్యాండెట్లుగా భావించాలని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అభిప్రాయ పడ్డారు. ఎన్డీఎ గెలుపు కోసం బీజేపీ పెద్దన్న పాత్ర పోషించిందనే విశ్వాసం కలిగించాలన్నారు.
AP Election 2024: నరసాపురం ఎంపీ స్థానంపై క్లారిటీ
మరిన్ని ఏపీ వార్తల కోసం
Updated Date - Apr 19 , 2024 | 05:43 PM