ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nara Lokesh: నిన్న హలో లోకేశ్.. నేడు యుగవళం.. దూసుకెళుతున్న నారా లోకేశ్

ABN, Publish Date - May 03 , 2024 | 07:15 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు. నిన్న హలో లోకేశ్ కార్యక్రమం.. నేడు యువగళం కార్యక్రమాలతో అలుపూ సొలుపూ లేకుండా ముందుకెళుతున్నారు. ఇవాళ నంద్యాలలో యువగళం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ నగర్ సమీపంలో సాయంత్రం యువ గళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున నంద్యాల శివారులోని ఓ పంక్షన్‌ హాలులో బసచేయనున్నారు.

నంద్యాల: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు. నిన్న హలో లోకేశ్ కార్యక్రమం.. నేడు యువగళం కార్యక్రమాలతో అలుపూ సొలుపూ లేకుండా ముందుకెళుతున్నారు. ఇవాళ నంద్యాలలో యువగళం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ నగర్ సమీపంలో సాయంత్రం యువ గళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున నంద్యాల శివారులోని ఓ పంక్షన్‌ హాలులో బసచేయనున్నారు. ఉదయం నుంచి ఫంక్షన్‌ హాలులో వివిధ సామాజిక వర్గాల నాయకులతో ఆయన సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటల నుంచి రాణి థియేటర్‌ వెనుక వైపు ఉన్న ప్రాంతంలో టీడీపీ శ్రేణులతో నారా లోకేశ్‌ సమావేశమై ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

20 లక్షల ఉద్యోగాల కల్పన బాధ్యత నాది


నిన్న హలో లోకేశ్‌ కార్యక్రమం యువతలో ఉత్సాహాన్ని నింపింది. చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి వద్ద గురువారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువతీ యువకులు తరలిరావడంతో సభా ప్రాంగణం కళకళలాడింది. తొలుత టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పార్టీ జెండాలతో తొండవాడ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచానికే ఒక విజనరీ నాయకుడైన చంద్రబాబు నాయుడు జన్మించిన నేల ఈ చంద్రగిరి అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన లోకేశ్‌ ప్రసంగంలో రాజకీయ చెణకులు విసిరి.. యువతచేత చప్పట్లు కొట్టించాయి. తరువాత పలువురు యువతీయువకులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్‌ తనదైన శైలిలో సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు. అంతకుముందు బీజీఎస్‌ కల్యాణ మండపంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అభ్యర్థులతో లోకేశ్‌ సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమై ఫొటోలు దిగారు.అనంతరం పలువురు వైసీపీ నాయకులు ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు.

AP Elections: నీవు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడా?..ముద్రగడపై పృథ్వి ఫైర్

Read Latest Election News or Telugu News

Updated Date - May 03 , 2024 | 09:26 AM

Advertising
Advertising