ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health: షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే ఇలా చేయండి..

ABN, Publish Date - Jun 06 , 2024 | 10:03 AM

ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి. శరీరానికి శక్తి పోషకాహారాలే. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య ప్రయోజనాల కోసం డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు. డ్రైఫ్రూట్స్‌తో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవల్సినవి వాల్ నట్స్. రోజూ తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.

Walnuts

ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి. శరీరానికి శక్తి పోషకాహారాలే. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య ప్రయోజనాల కోసం డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు. డ్రైఫ్రూట్స్‌తో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవల్సినవి వాల్ నట్స్. రోజూ తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే వాల్ నట్ లు మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాల్ నట్స్ లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో వాల్ నట్స్ ను డ్రై ఫ్రూట్స్ లో రారాజుగా పిలుస్తుంటారు. నానబెట్టి ఉదయం పరగడుపునే తింటే వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Sleeping on the Floor: నేలపై పడుకోవడం మంచిదేనా? ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..!


రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

డ్రైఫ్రూట్స్ లో రోగనిరోధక శక్తిని పెంచే శక్తి ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో వ్యక్తిలోని రోగనిరోధక శక్తిని ఇవి పెంచుతాయి. అనేక వ్యాధుల నుంచి వాల్ నట్స్ రక్షణ కల్పిస్తాయి. ఆరోగ్యంగా, ధృడంగా ఉండేందుకు మనం తీసుకునే ఆహారంలో నానబెట్టిన వాల్ నట్స్ ను తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.


జీర్ణక్రియ వ్యవస్థ..

వాల్ నట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. తగిన మోతాదులో వాల్ నట్స్ తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ వ్యవస్థ మెరుగవుతుంది.


మధుమేహన్ని నియంత్రించవచ్చు

షుగర్ ఉన్న వారు నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. వాల్ నట్ లను రోజూ తినేవారిలో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాల్ నట్ లు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి.


క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే లక్షనాలు వాల్ నట్స్ లో ఉన్నాయి. వీటిలో పాలీఫెనాల్ ఎల్లాగిటానిన్ లు ఉంటాయి. అనేక రకాల క్యాన్సర్ ల నుండి రక్షించడంలో ఇవి ఉపయోగపడతాయి.


Weight Loss Pills: బరువు తగ్గడానికి టాబ్లెట్లు వాడుతున్నారా? బయటపడిన షాకింగ్ నిజాలు తెలిస్తే..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Health News and Latest Telugu News

Updated Date - Jun 06 , 2024 | 10:03 AM

Advertising
Advertising