ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diabetes: షుగర్ వ్యాధి వేధిస్తోందా.. ఈ పువ్వులతో అద్భుత ప్రయోజనాలు..

ABN, Publish Date - Oct 21 , 2024 | 07:24 AM

షుగర్ వ్యాధిని పూర్తిగా తగ్గించలేం. కానీ దాన్ని అదుపులో ఉంచేందుకు మాత్రం మందులు వేసుకోవడం సహా ఆహార నియమాలు, తగినంత వ్యాయాయం చేయాల్సి ఉంటుంది. అలాగే దీన్ని నియంత్రించేందుకు ప్రకృతి మనకు అనేక రకాల ఔషధ మెుక్కలను అందించింది.

ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. కానీ ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా మందికి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో రోగాల బారిన పడుతున్నారు. కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తూ మనుషులను వేధిస్తున్నాయి. ఆస్పత్రుల చుట్టూ తిప్పుతూ జేబులు ఖాళీ చేయిస్తున్నాయి. అందులో ముఖ్యంగా షుగర్, క్యాన్సర్, గుండె సమస్యలు సహా అనేకం ఉన్నాయి. అయితే నేటి సమాజంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా ఎదుర్కొంటున్న సమస్య డయాబెటిస్. దీని బారిన పడి, ప్రతి రోజూ మందులు వాడలేక అవస్థలు పడుతున్న వారు చాలా మందే ఉన్నారని చెప్పాలి.


షుగర్ వ్యాధిని పూర్తిగా తగ్గించలేం. కానీ దాన్ని అదుపులో ఉంచేందుకు మాత్రం మందులు వేసుకోవడం సహా ఆహార నియమాలు, తగినంత వ్యాయాయం చేయాల్సి ఉంటుంది. అలాగే దీన్ని నియంత్రించేందుకు ప్రకృతి మనకు అనేక రకాల ఔషధ మెుక్కలను అందించింది. అయితే కొన్ని ప్రత్యేకమైన పువ్వులతో షుగర్ వ్యాధిని నయం చేసుకోవచ్చని మీకు తెలుసా. వాటిని తగిన విధంగా వినియోగించడం వల్ల ఈ వ్యాధిని సహజంగానే అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే వాటితో మరిన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. ఆ పువ్వులు ఏంటి, వాటి ద్వారా షుగర్ వ్యాధిని ఎలా కంట్రోల్ చేయెుచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..


మందార పువ్వు

మందారం చెట్లు అనేవి గ్రామాల్లో విరివిరిగా కనిపిస్తుంటాయి. మందారం ఆకులను ఎక్కువగా చుట్టు సమస్యలు తగ్గించేందుకు వాడుతుంటారు. ఆకులను మెత్తగా నూరి ఆ పేస్టును జుట్టుకు పట్టిస్తారు. తద్వారా చుండ్రు సహా ఇతర సమస్యలు తొలగిపోయి జుట్టు ఒత్తుగా మారుతుంది. అయితే మందార పువ్వులతో డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు. ఈ పువ్వులను పానీయంగా చేసుకుని తాగితే, ఇందులోని మంచి గుణాలు ఇన్సులిన్ స్థాయిలు నియంత్రించి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది.


అరటి పువ్వు

అరటి పువ్వు అనేది మధుమేహాన్ని నియంత్రించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అరటి పువ్వుతో చేసిన కూరలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే కూర రుచీ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి తద్వారా షుగర్ వ్యాధిని అదుపు చేస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరిచి అనేక ఉదర సంబంధ సమస్యలు తగ్గిస్తుంది. అలాగే దీనిలోని పోషకాలు అధిక బరువు నుంచి విముక్తి కలిగించేందుకు దోహదపడతాయి. అరటి పువ్వులో విటమిన్ ఎ, సి, బి-6, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.


మడగాస్కర్ పెరివింకిల్

ప్రకృతి ప్రసాదించిన మరో గొప్ప ఔషధ మెుక్క మడగాస్కర్ పెరివింకిల్. దీని ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. ఈ పువ్వుతోనూ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయెుచ్చు. ముఖ్యంగా ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే చర్మ సమస్యలు, గొంతు వ్యాధులు సహా అనేక రోగాలను తగ్గిస్తుంది.


దాలియా పువ్వు

దాలియా పువ్వు అనేది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడం వల్ల ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా దీన్ని మెదడువాపు రోగం తగ్గించేందుకు వైద్యులు వినియోగిస్తుంటారు. నిజం చెప్పాలంటే ఈ పువ్వు గురించి చాలా మందికి తెలియదు. ఇది చర్మ సౌందర్యానికీ బాగా ఉపయోగపడుతుంది. చర్మం మృదువుగా మారి ఆకర్షణీయంగా ఉండేందుకు దోహదపడుతుంది.

Updated Date - Oct 21 , 2024 | 07:24 AM