ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chayote Benefits: సీమ వంకాయ ఎప్పుడైనా తిన్నారా.. బాబోయ్ ఇన్ని ప్రయోజనాలా..

ABN, Publish Date - Oct 22 , 2024 | 08:35 AM

సీమ వంకాయను ఆహారంలో భాగం చేసుకుంటే ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు. చాయోట్‌లో పీచు పదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ బాగా పెరిగిపోయింది. అందుకు కారణం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల అనేక రోగాల బారిన పడుతుండటం. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాలా మంది వ్యాయామాలు చేస్తూ మంచి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే చాయోట్‌ను మీరెప్పుడైనా తిన్నారా.. అదేనండి, సీమ వంకాయ. దీన్నే బెంగుళూరు వంకాయ అని కూడా అంటారు. చాయోట్‌ను ఆహారంలో భాగం చేస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. రక్తపోటు, జీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి అనేక సమస్యలకు చెక్ పెడుతుంది. సీమ వంకాయ అద్భుత ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


సీమ వంకాయ అద్భుత ప్రయోజనాలు ఇవే..

  • షుగర్ వ్యాధి ఉన్నవారికి చాయోట్ మంచి ఔషధంగా పని చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించి డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచి వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలిగిస్తాయి.

  • సీమ వంకాయలో ఉండే పోషకాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తరచుగా తినడం వల్ల దీనిలోని మంచి గుణాలు మూత్రపిండాలు, మూత్రనాళాలను శుభ్రం చేసేందుకు తోడ్పడతాయి. అలాగే మూత్రంలో ఉండే వ్యర్థాలు బయటకు పంపి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికీ ఇది ఉపశమనం కలిగిస్తుంది.

  • సీమ వంకాయ అనేది గుండె ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. దీనిలోని పొటాషియం, పీచు పదార్థాలు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పీచు పదార్థం రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌, మలినాలను తొలగిస్తుంది. అలాగే రక్తనాళాలను శుభ్రం చేసి రక్త ప్రసరణ మెరుగుపడేలా చేస్తుంది. పొటాషియం రక్తపోటు నియంత్రించి హార్ట్‌ఎటాక్ రాకుండా సహాయపడుతుంది.

  • చాయోట్‌‌ను తరచుగా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక జీర్ణ సమస్యలు నివారించుకోవచ్చు. సీమ వంకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు దోహదపడతాయి. దాని వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

  • చాయోట్ వల్ల గర్భిణులకు ప్రత్యేక లాభాలు ఉంటాయి. సీమ వంకాయలో ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది. పోలేట్ అనేది గర్భిణులకు చాలా మంచి ఆహార పదార్థం అని వైద్యులు చెప్తుంటారు. గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఇది దోహదపడుతుంది. శిశువు మస్తిష్కం, నరాల వృద్ధికి ఫోలేట్ అనేది ముఖ్యమైన పోషకం. కాబట్టి దీన్ని వారికి తరచూ ఆహారంగా అందిస్తే మంచి శిశువు జన్మిస్తారు.

  • సీమ వంకాయను ఆహారంలో భాగం చేసుకుంటే ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు. చాయోట్‌లో పీచు పదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే తక్కువ క్యాలరీలు కలిగి ఆహార పదార్థం. కప్పు సీమ వంకాయలో కేవలం 25క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అందువల్ల త్వరగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

  • సీమ వంకాయను తినే వారిలో చర్మ, జుట్టు సమస్యలు తగ్గుతాయి. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. చర్మ కణాల పునరుత్పత్తికి చాయోట్ దోహదపడుతుంది. అలాగే జుట్టు సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.

Updated Date - Oct 22 , 2024 | 08:39 AM