Share News

CDSCO Report: పారాసిటమాల్ వాడుతున్నారా.. అరచేతుల్లో మీ ప్రాణాలు!

ABN , Publish Date - Jun 24 , 2024 | 07:10 PM

జ్వరం, తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేదేంటి. పారాసిటమాల్ ట్యాబ్లెటే కదా. ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే ఆ మెడిసిన్ వేసుకోవడానికే భయపడతారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది.

CDSCO Report: పారాసిటమాల్ వాడుతున్నారా.. అరచేతుల్లో మీ ప్రాణాలు!

ఇంటర్నెట్ డెస్క్: జ్వరం, తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేదేంటి. పారాసిటమాల్ ట్యాబ్లెటే కదా. ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే ఆ మెడిసిన్ వేసుకోవడానికే భయపడతారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది.

అందులో పారాసెటమాల్‌ సహా 50 రకాల మెడిసన్లు నాణ్యంగా లేవని తేలింది. CDSCO అనేది ఔషధాల భద్రత, సమర్థత, నాణ్యతను నిర్ధారించే అగ్రశ్రేణి ఔషధ నియంత్రణ సంస్థ. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వచ్చిన వెంటనే పారాసిటమాల్ వేసుకుంటాం. అయితే సీడీఎస్‌సీఓ రెగ్యులేటరీ అధికారులు నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పారసిటమాల్ లేదని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.


పారాసెటమాల్‌తో సహా 50 రకాల మెడిసన్లు.. వైద్యులు సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా లేవని పరిశోధనలో వెల్లడైంది. అంటే మందులు ఉద్దేశించిన విధంగా పని చేయకపోవచ్చు లేదా రోగులకు హాని కలిగించవచ్చు.

సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిపుణులు.. వాఘోడియా (గుజరాత్), సోలన్ (హిమాచల్ ప్రదేశ్), జైపుర్ (రాజస్థాన్), హరిద్వార్ (ఉత్తరాఖండ్), అంబాలా, ఇండోర్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రగ్ శాంపిల్స్ తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన ఫార్మాస్యూటికల్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోలర్ అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ నాణ్యతలో రాజీపడకూడదని స్పష్టం చేస్తున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jun 24 , 2024 | 07:10 PM