ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Garlic benefits: కాల్చిన వెల్లుల్లి.. దాని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

ABN, Publish Date - Oct 20 , 2024 | 07:45 AM

వెల్లుల్లి అనేది భారతీయ వంటగదుల్లో సర్వసాధారణంగా కనిపించే పదార్థం. వందలాది సంవత్సరాలుగా భారతీయులు దీన్ని వంటల్లో వినియోగిస్తున్నారు. చికెనైనా, మటనైనా, కూరగాయాలు, ఆకుకూరలైనా.. వంట ఏదైనా కాని వెల్లుల్లి లేనిది పూర్తికాదంటే అతిశయోక్తి కాదు. వెల్లుల్లి అద్భుత ప్రయోజనాలు తెలుసు కాబట్టే మన పూర్వీకులు దాన్ని ఆహారంలో భాగం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: వెల్లుల్లి అనేది భారతీయ వంటగదుల్లో సర్వసాధారణంగా కనిపించే పదార్థం. వందలాది సంవత్సరాలుగా భారతీయులు దీన్ని వంటల్లో వినియోగిస్తున్నారు. చికెనైనా, మటనైనా, కూరగాయాలు, ఆకుకూరలైనా.. వంట ఏదైనా కాని వెల్లుల్లి లేనిది పూర్తికాదంటే అతిశయోక్తి కాదు. వెల్లుల్లి అద్భుత ప్రయోజనాలు తెలుసు కాబట్టే మన పూర్వీకులు దాన్ని ఆహారంలో భాగం చేశారు. అయితే కాల్చిన వెల్లుల్లి తింటే మరిన్ని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయానే పరిగడుపున రెండు కాల్చిన వెల్లుల్లి రెబ్బలు తింటే చాలా రోగాలకు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె సమస్యలు, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు సహా చాలా రోగాలను ఇది కట్టడి చేస్తుందని చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


వెల్లుల్లి- అద్భుత ప్రయోజనాలు..

  • వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇది హృదయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే ఆలిసిన్ అనే రసాయనం రక్తంలో చెడు కొవ్వును తగ్గిస్తుంది. రక్తనాళాలకు విశ్రాంతి కలిగించి తద్వారా రక్తపోటు నియంత్రణకు తోడ్పడుతుంది. రోజూ ఉదయానే ఖాళీ కడుపుతో కాల్చిన వెల్లుల్లి రెబ్బలు తింటే రక్త ప్రసరణ మెరుగుపడి గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

  • షుగర్ వ్యాధిగ్రస్తులకు వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది. పరిగడుపున వెల్లుల్లి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వెల్లుల్లి అనేది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల డయోబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

  • జీర్ణ సమస్యల నివారణకు వెల్లుల్లి గొప్ప ఔషధంగా చెప్పొచ్చు. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. రోజూ ఉదయాన్నే దీన్ని తినడం ద్వారా మలబద్ధకం, కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు తగ్గించుకోవచ్చు.

  • ప్రస్తుతం ఊబకాయం సమస్య చాలా మందిని వేధిస్తోంది. దీని బారి నుంచి తప్పించుకునేందుకు వెల్లుల్లి మంచి మందులా పని చేస్తుంది. వెల్లుల్లి గుణాలు చెడు కొవ్వును తగ్గించడం, ఆకలిని నియంత్రించడం చేస్తాయి. అలాగే అతిగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది.

  • వెల్లుల్లి అనేది కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను శరీరం నుంచి బయటకు పంపిస్తాయి.

  • ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులకు వెల్లుల్లితో చెక్ పెట్టొచ్చని వైద్యులు చెప్తున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తింటే కీళ్ల నొప్పులు, వాపు తగ్గుతాయి. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల ఇది సాధ్యం అవుతుంది.

  • వెల్లుల్లి అనేది చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అనేక చర్మ సమస్యలకు చెక్ పెడతాయి. అలాగే ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కాంతివంతంగా మారుతుంది. ముఖ్యంగా యాక్నే, మెుటిమలు సమస్యలు తగ్గుతాయి.

  • వెల్లుల్లిలో ఉండే మంచి గుణాలు క్యాన్సర్ వ్యాధిని నిరోధించేందుకు తోడ్పడతాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సంయోగాలు క్యాన్సర్ కణాలను అడ్డుకునే లక్షణాలు కలిగి ఉంటాయి. కోలోన్, ప్రోస్టేట్ వంటి క్యాన్సర్‌ కారకాలను నిరోధించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.


ఉదయాన్నే పరిగడుపున కాల్చిన వెల్లుల్లి తిన్న 20 నుంచి 30నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీరు తాగడం వల్ల దాని శక్తి మరింత పెరుగుతుంది. తద్వారా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఇలా చేస్తే కొంతమందికి ఉదరంలో ఆమ్ల లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని ఖాళీ గడుపుతో తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Updated Date - Oct 20 , 2024 | 07:45 AM