ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health News: క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించే డ్రైఫ్రూట్ గురించి మీకు తెలుసా?

ABN, Publish Date - Jul 29 , 2024 | 08:49 AM

ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. హడివిడిగా ఆఫీసుకు వెళ్లడం, అక్కడ పని ఒత్తిడితో బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడమే సరిపోతుంది. పని ధ్యాసలో పడి ఎక్కువ శాతం మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం(డయాబెటీస్) బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.

ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. హడివిడిగా ఆఫీసుకు వెళ్లడం, అక్కడ పని ఒత్తిడితో బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడమే సరిపోతుంది. పని ధ్యాసలో పడి ఎక్కువ శాతం మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం(డయాబెటీస్) బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే రోగాల బారిన పడకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు మనకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటితోపాటు మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచేందుకు డ్రైఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం ద్వారా తగినంత పోషకాలు శరీరానికి అందడమే కాకుండా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.


ముఖ్యంగా డ్రైఫ్రూట్స్‌లో రారాజుగా పిలిచే వాల్ నట్స్(అక్రోట్) తినడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. ఇంకా చెప్పాలంటే ఇవి మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తి మెరుగుపరిచేందుకు బాగా ఉపయోగపడతాయని వైద్యులు చెప్తుంటారు. వీటిలో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి పోషకాలు ఉండడంతో ఆరోగ్య ప్రియులు వీటిని తినేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అయితే రోజుకు రెండు, మూడు రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలి. అప్పుడే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. వాల్ నట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..


వివిధ క్యాన్సర్లను తగ్గిస్తుంది..

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని పట్టిపీడిస్తున్న సమస్య క్యాన్సర్. దీనికి ఇప్పటివరకూ సరైన మందు లేదు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ బారిన ఎక్కువ మంది పడుతుంటారు. వాల్ నట్స్‌ రెగ్యులర్‌గా తినడం వల్ల వీటిలో ఉండే పాలీఫెనాల్ ఎల్లాగిటానిన్‌లు వివిధ రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి.

మలబద్ధకాన్ని నివారిస్తుంది..

అక్రోట్ తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ బాగా మెరుగుపడుతుంది. వీటిలో ఫైబర్ శాతం పుష్కలంగా ఉండడంతో జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రమం తప్పుకుండా వీటిని తినడం వల్ల మలబద్ధకం సమస్య చాలా వరకు తొలగిపోతుంది. అక్రోట్‌తోపాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మలబద్ధకం నివారణకు చాలా ముఖ్యం.


గుండె పదిలం..

ఈరోజుల్లో చిన్నాపెద్దా అని తేడా లేకుండా ప్రజలు హార్ట్ఎటాక్ బారిన పడుతున్నారు. పలు రకాల గుండె సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గుండెను పదిలంగా ఉంచుకునేందుకు అక్రోట్ సహాయపడతాయి. వీటిలో ఉండే ఒమేగా-3ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని చెడు కొవ్వును సైతం తగ్గిస్తాయని వైద్యులు చెప్తున్నారు.

షుగర్ వ్యాధి నియంత్రణ..

మధుమేహం అనేది ప్రజలను పట్టిపీడిస్తున్న మరో పెద్ద సమస్య. మన దేశంలోనూ రోజురోజుకు షుగర్ పెషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. అయితే నానబెట్టిన వాల్ నట్స్ రెగ్యులర్‌గా తినడం టైప్-2మధుమేహానికి చెక్ పెట్టవచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచేందుకు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు.


ఎముకల దృఢత్వానికి..

అక్రోట్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఆల్ఫా-లినోలెనిక్ ఎముకలు, దంతాలు దృఢంగా ఉంచేందుకు సహాయపడుతుంది. వాల్ నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు దంతాలు, ఎముకుల వాపును తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాల్షియం తక్కువగా ఉన్న వ్యక్తులు అక్రోట్ తినడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

డ్రైఫ్రూట్స్‌లో మరీ ముఖ్యంగా వాల్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. దీంతో అనేక వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. ప్రతిరోజూ నానబెట్టిన అక్రోట్ తీసుకోవడం అలవాటు చేసుకోవడం ద్వారా రెగ్యులర్‌గా వచ్చే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Updated Date - Jul 29 , 2024 | 08:49 AM

Advertising
Advertising
<