Share News

Health Awareness: పచ్చిపాలు తాగేవారికి షాకింగ్ న్యూస్.. కేరళ వైద్యుడు చెప్ప నిజమిదే..

ABN , Publish Date - Oct 31 , 2024 | 11:42 AM

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే పాలను పచ్చిగా తాగడం గురించి కేరళకు చెందిన ఒక వైద్యుడు కొన్ని నిజాలు చెప్పుకొచ్చాడు.

Health Awareness: పచ్చిపాలు తాగేవారికి షాకింగ్ న్యూస్.. కేరళ వైద్యుడు చెప్ప నిజమిదే..
Raw Milk

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలను ఆహారంలో తీసుకోవడం వల్ల పోషకాహార లోపం అరికట్టవచ్చని చెబుతారు. అయితే కొందరు పచ్చి పాలు తీసుకోవడం మంచిదని అంటుంటారు. పాలను కొనుగోలు చేయగానే వాటిని వేడి చేయకుండా అలాగే తాగుతుంటారు. అయితే కేరళకు చెందిన హెపటాలజిస్ట్ పచ్చి పాలను తాగడం చాలా ప్రమాదం అని హెచ్చరించారు. అసలు ఆయన అలా స్పందించడం వెనుక కారణం ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

జీలకర్రను ఇలా వాడితే శరీరంలో కొవ్వు కరిగిపోద్ది..


పాలు ఆరోగ్యకరైన ఆహారమే అయినా, పాలలో మంచి ప్రోటీన్ ఉన్నా పాలను పచ్చిగా తాగడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వస్తాయని సదరు డాక్టర్ తెలిపారు. పచ్చిపాలలో ఇ-కోలి, కాంపిలోబాక్టర్, ఎర్సినియా, బ్రుసెల్లా, కొక్సిల్లా, లిస్టేరియా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటాయి. పాలను వేడి చేయకుండా పచ్చిగానే తాగడం వల్ల ఈ బ్యాక్టీరియా కడుపులోకి వెళుతుంది. ఇది జీర్ణ సమస్యలు మాత్రమే కాకుండా ఇతర శారీరక అనారోగ్యాలకు కూడా కారణం అవుతుంది. ఈ బ్యాక్టీరియాలు నశించాలంటే పాలను పాశ్చరైజేషనా్ చేయడం తప్పనిసరి అని డాక్టర్ పేర్కొన్నారు. పాశ్చరైజ్ చేయని పాలను తాగడం వల్ల పాలలో బ్యాక్టీరియా మెదడు, గుండె పైన దాడి చేస్తాయని ఇవి మూర్చలకు కారణం అవుతుందని అన్నారు. కొన్ని సార్లు ఈ బ్యాక్టీరియా వల్ల జరిగే నష్టంలో మరణం కూడా సంభవించవచ్చని ఆయన వివరించారు.

కేరళకు చెందిన హెపటాలజిస్ట్ అయిన డాక్టర్ పై విషయాలు చెప్పడానికి మూల కారణం ఆయన సోషల్ మీడియాలో చూసిన ఒక వీడియో. పంజాబ్ లో జరిగినట్టు చెప్పబడుతున్న ఒ సంఘటన డాక్టర్ కంట పడింది. ఒక మహిళ పచ్చి పాలను బకెట్ నుండి తీసి తన బిడ్డకు తాపిస్తున్న వీడియో అది. ఈ వీడియో చూసిన వైద్యుడు పై విషయాన్నీ తెలిపి " దయచేసి పిల్లలకు పచ్చి పాలు తాగించకండి" అని రిక్వెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

ఈ లక్షణాలు కనిపిస్తే.. బోలు ఎముకల వ్యాధి మొదలైనట్టే..

Health Tips: తేనెను వాడేవారు అందరూ తెలుసుకోవాల్సిన విషయం.. ఈ ఆహారాలతో అస్సలు కలిపి తినకూడదు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 31 , 2024 | 11:42 AM