ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: డైటింగ్, జిమ్ లేకుండానే బరువు తగ్గొచ్చు.. ఆ సీక్రెట్ ఇదే..!

ABN, Publish Date - Aug 09 , 2024 | 08:21 PM

Weight Loss Tips: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో స్థూలకాయం, ఊబకాయం, మధుమేహం వంటి ప్రమాదకరమైన అనారోగ్యాల బారిన పడుతున్నారు. పైగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వలన కూడా ఫిట్‌నెస్‌ని కోల్పోతున్నారు.

Weight Loss Tips

Weight Loss Tips: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో స్థూలకాయం, ఊబకాయం, మధుమేహం వంటి ప్రమాదకరమైన అనారోగ్యాల బారిన పడుతున్నారు. పైగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వలన కూడా ఫిట్‌నెస్‌ని కోల్పోతున్నారు. భారీగా బరువు పెరిగిన తరువాత గానీ, అనారోగ్యానికి గురైన తరువాత గానీ తేరుకుని.. వ్యాయామాలు, మంచి ఆహారాలు తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డైటింగ్ చేయడం, గంటల తరబడి జిమ్‌లలో కుస్తీ పట్టడం చేస్తున్నారు. అయితే, ఎలాంటి డైటింగ్ లేకుండా కష్టపడి వ్యాయామాలు చేయకుండా ఫిట్‌గా ఉండేందుకు చిన్న సలహాలు సూచనలు చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. చిన్న చిన్న పనులు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. మరి ఆరోగ్య నిపుణులు చెబుతున్న ఆ టిప్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..


డైటింగ్, జిమ్‌కి వెళ్లకుండా బరువు తగ్గడం ఎలా..?

నడవడం: ఉదయం, సాయంత్రం వాకింగ్ అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి ఇదే సులభమైన మార్గం. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే కూర్చోకుండా కొంత సమయం పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.


నీరు త్రాగాలి: శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి తగిన మోతాదులో నీరు త్రాగాలి. నీటి కొరత మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. బరువును నియంత్రించడానికి.. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి.

టైమ్ ప్రకారం ఆహారం తినాలి: బరువు తగ్గడానికి.. ఆహారాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా డిన్నర్ రాత్రి 7, 8 గంటల లోపే తినేలా చూసుకోవాలి. రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

ఇంట్లో తయారు చేసిన ఆహారం: బయటి జంక్‌లు, ఫాస్ట్‌ఫుడ్‌లు తినకుండా ఇంటి ఆహారాన్ని తినండి. ఇంట్లో వండిన ఆహారం స్వచ్ఛమైనది, పోషకాలు కలిగి ఉంటుంది.

For More Health News and Telugu News..

Updated Date - Aug 09 , 2024 | 08:21 PM

Advertising
Advertising
<