ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health News: చేప తలలో ఉండే విలువైన పోషకాలు ఏంటో తెలుసా?

ABN, Publish Date - Aug 03 , 2024 | 08:07 AM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహారంలో సీఫుడ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ చేపల కూర అంటే పడిచస్తారు. ముఖ్యంగా గోదావరిలో దొరికే పులస చేపను జీవితంలో ఒక్కసారైనా తినాల్సిందే. చాప మాంసంలో చాలా విలువైన పోషకాలు ఉంటాయి. దీన్ని తరచూ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు సూచిస్తుంటారు. అయితే చాప తలను తినొచ్చా, తింటే ఏం అవుతుందో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహారంలో సీఫుడ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ చేపల కూర అంటే పడిచస్తారు. ముఖ్యంగా గోదావరిలో దొరికే పులస చేపను జీవితంలో ఒక్కసారైనా తినాల్సిందే. చాప మాంసంలో చాలా విలువైన పోషకాలు ఉంటాయి. దీన్ని తరచూ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు సూచిస్తుంటారు. అయితే చాప తలను తినొచ్చా, తింటే ఏం అవుతుందో ఇప్పుడు చూద్దాం..


చేప తల తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అయితే చాపలు తినేటప్పుడు చాలా మంది దాని తలను కూడా తింటుంటారు. ప్రత్యేకంగా పులుసు, ఫ్రై చేసుకుని మరీ లాగిచ్చేస్తుంటారు. అయితే చేప తల తినడం మంచిదేనా అనే ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాలి. చేప తలకాయలో సమృద్ధిగా పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు గుండె ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒమేగా 3ని మానవ శరీరం తయారు చేసుకోలేదు కాబట్టి చేపలు తరచూ తినడం వల్ల దీన్ని పొందవచ్చు.


చేప తలలో ఉండే పోషకాలు కళ్లు, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పిల్లలు, వృద్ధులు దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. చేప తలకాయ తినడం వల్ల మతిమరుపు దూరం అవుతుంది. మెదడు పదునుగా మారి ఏదైనా సరే గుర్తుంచుకోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే కిడ్నీ రోగులకు సైతం చాప తల ఔషధం లాంటిది. కిడ్నీలో రాళ్లతో బాధపడే వారు తరచుగా దీన్ని తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా దీంట్లో ఇతర అనేక రోగాలు తగ్గించే గుణం ఉన్నందున ఎలాంటి అనుమానానికి తావు లేకుండా వాటిని హాయిగా తినొచ్చు.


చేపల్లో ఉండే పోషకాలు..

చేపలు తినడం వల్ల ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్పరస్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలోని లవణాల స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అలాగే కండరాల తిమ్మిరిని కూడా తగ్గిస్తాయి. చేప ఆహారంలో విటమిన్ డి, బి2 పుష్కలంగా ఉంటాయి. ఇవి కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నానికి సహాయపడతాయి. ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి అవసరం, బి2 అనేది చర్మం, రక్త కణాలకు ఉపయోగపడుతుంది. ఇక చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఒమేగా-3ని మన శరీరం తయారు చేసుకోలేదు కాబట్టి తరచూ చేపలు తినాలి. వీటిల్లో అధిక మెుత్తంలో ప్రోటీన్ సైతం దొరుకుతుంది. కాబట్టి వీటిని తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

Updated Date - Aug 03 , 2024 | 08:07 AM

Advertising
Advertising
<