Share News

Protein Powder: పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే.. ఇంట్లోనే ఇలా ప్రోటీన్ పౌడర్ తయారుచేయండి..!

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:59 PM

పిల్లలు ఆహారం సరిగా తినరు. వాళ్లకు ఏమి పెట్టినా అరకొర తిని వదిలేస్తుంటారు. దీంతో పిల్లలకు అవసరమైనంత పోషకాలు ఇవ్వడంలో తల్లిదండ్రులు విఫలం అవుతుంటారు. ఇందుకోసమే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు హెల్త్ డ్రింక్స్, ప్రోటీన్ డ్రింక్స్ ఇస్తుంటారు. కానీ..

Protein Powder: పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే..  ఇంట్లోనే ఇలా ప్రోటీన్ పౌడర్ తయారుచేయండి..!

పిల్లలు ఆహారం సరిగా తినరు. వాళ్లకు ఏమి పెట్టినా అరకొర తిని వదిలేస్తుంటారు. దీంతో పిల్లలకు అవసరమైనంత పోషకాలు ఇవ్వడంలో తల్లిదండ్రులు విఫలం అవుతుంటారు. ఇందుకోసమే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు హెల్త్ డ్రింక్స్, ప్రోటీన్ డ్రింక్స్ ఇస్తుంటారు. బయట అమ్మే ఉత్పత్తులు వైద్యులు సూచించినవే అయినా వీటిలో కొన్ని కృత్రిమ పోషకాలు కలిసి ఉంటాయి. పైపెచ్చు ధర కూడా ఎక్కువగా ఉంటుంది. అదే ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోగలిగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలకు మంచి పోషకాలు అందుతాయి. దీనికి కావలసిన పదార్థాలేంటో.. దీన్నెలా తయారుచేసుకోవాలో తెలుసుకుంటే..

ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి మేలు? దిండు వేసుకుని లేదా దిండు లేకుండానా..!


కావలసిన పదార్థాలు..

మఖానా.. 50గ్రాములు.

జీడిపప్పు.. 50గ్రాములు

వేరుశనగ.. 50 గ్రాములు

వాల్నట్స్.. 50గ్రాములు

అవిసె గింజలు.. కొద్దిగా(అవిసె గింజలు వేడి చేసే గుణం కలిగి ఉంటాయి. వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి)

వేయించిన శనగపప్పు.. 50 గ్రాములు

బాదం.. 50గ్రాములు

యాలకులు.. 2 స్పూన్లు

పెరుగుతో ఉప్పు లేదా పంచదార.. ఏది కలుపుకుని తింటే ఆరోగ్యమంటే..!


తయారుచేసే విధానం..

పైన చెప్పుకున్న పదార్థాలను అన్నింటిని నూనె కాని, నెయ్యి కాని లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లారిన తరువాత మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని జార్ లో నిల్వచేసుకోవాలి.

ఎలా వాడాలి..

ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో 1 టీస్పూన్ ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి ఉదయం లేదా సాయంత్రం సమయంలో పిల్లలకు ఇవ్వాలి. దీన్ని పిల్లలు మాత్రమే కాదు.. పెద్దలు కూడా వాడవచ్చు.

ప్రయోజనాలు..

ఎముకలు, కండరాల నిర్మాణం, కండరాల మరమ్మత్తు కోసం అవసరమైన అమైనో ఆమ్లాలు ఈ ప్రోటీన్ పౌడర్ లో పుష్కలంగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పిల్లలలో రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 27 , 2024 | 12:59 PM