Share News

Rice Vs Roti: అన్నం లేదా చపాతీ.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..

ABN , Publish Date - Oct 31 , 2024 | 04:33 PM

భారతీయులు తీసుకునే ఆహారంలో అన్నం, రొట్టెలు ప్రధాన భాగంగా ఉంటాయి. వీటిలో ఏది ఆరోగ్యమంటే..

Rice Vs Roti:  అన్నం లేదా చపాతీ.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..

భారతీయులు ఆహార ప్రియులు. ముఖ్యంగా బియ్యంతో చేసినన్ని వంటకాలు మరింక దేంతోనూ చేయలేరన్నది చాలా నిజం. దక్షిణాది రాష్ట్రాలలో అన్నమే ప్రధాన ఆహారం. ఉత్తరాది రాష్ట్రాలలో రొట్టెలు, చపాతీలు ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే నేటి కాలంలో.. షుగర్, బిపి, అధిక బరువు, హార్మోన్ సమస్యలు వంటివి చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం మీద స్పృహ కొద్దీ కొందరు అన్నానికి బదులు చపాతీ తింటుంటారు. అయితే కొందరు వైద్యులు, ఆహార నిపుణులు చపాతీలు కూడా అంత ఆరోగ్యకరమైనవి ఏమీ కాదని అంటుంటారు. చపాతీ, అన్నం రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? ఆహార నిపుణులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే..

Optical Illusion: మీ కంటిచూపుకు ఛాలెంజ్.. 8 సెకెన్లలోపు ఫొటోలో కుక్క ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం..


చపాతీ లేదా అన్నం రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అనే విషయం వాటిని తీసుకునే వ్యక్తి ఆరోగ్యం, ఆ వ్యక్తి రోజులో తీసుకునే ఇతర ఆహారాల మీద ఆధారపడి ఉంటుందట. అన్నం, చపాతీ రెండింటిలో ఉన్న పోషకాలను పరిశీలిస్తే రెండింటి మధ్య కేవలం కొద్ది పరిమాణంలో మాత్రమే తేడా ఉంటుందని ఆహార పరిశోధనలు చెబుతున్నాయి.

చపాతీలు, అన్నం రెండింటిని పోలిస్తే చపాతీలో అన్నం కంటే తక్కువ కార్బోహేడ్రేట్లు ఉంటాయి. కానీ సాధారణం బియ్యం అంటే పాలిష్ పెట్టిన బియ్యానికి బదులు బ్రౌన్ రైస్, ముడి బియ్యం వంటి బియ్యంలో చపాతీ కంటే తక్కువ కార్బోహేడ్రేట్స్ ఉంటాయి.

గోధుమ పిండితో చేసిన చపాతీల కంటే సజ్జలు, జొన్నలు, రాగులు మొదలైన వాటితో చేసే చపాతీలు, రొట్టెలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్, ఫాస్పరస్, ఐరన్ మొదలైనవి ఎక్కువగా ఉంటాయి.

Health Awareness: పచ్చిపాలు తాగేవారికి షాకింగ్ న్యూస్.. కేరళ వైద్యుడు చెప్ప నిజమిదే..


అన్నం కంటే రొట్టెలు, చపాతీలలో పైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలోనూ, మధుమేహం ఉన్నవారికి, సహాయపడుతుంది. ఎక్కువ సేపు కదలకుండా , శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని వర్క్ చేసేవారు అన్నానికి బదులు రొట్టెలను ఒక పరిమిత మొత్తంలో తీసుకోవడం మేలు.

చాలామంది అన్నం కంటే రొట్టెలు లేదా చపాతీలు ఎక్కువ ఆరోగ్యం అని చెప్పడానికి కారణం కొలత. చపాతీ లేదా రొట్టెలను కొలత పెట్టుకుని ఒకటి, రెండు అని లెక్క పెట్టుకుని తినవచ్చు. కానీ అన్నం విషయంలో అలా కాదు.. కూరలు ఓ రెండు మూడు రకాలు ఉన్నప్పుడు.. కూరలలో ఉప్పు, కారం ఎక్కువగా ఉన్నప్పుడు అన్నం ఎక్కువగా తినేస్తారు. ఇది శరీరంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ చేరడానికి కారణం అవుతుంది. అలా కాకుండా అన్నాన్ని ఒక కప్పు కొలత తీసుకుని దానికి సమాన పరిమాణంలో ఉప్పు కారం తక్కువ ఉండి కూరగాయలు ఎక్కువ జోడించిన కూరను ఒక కప్పు తీసుకుని భోజనం చెయ్యాలి. అన్నం, కూరలు సమాన పరిమాణంలో ఉండాలి. ఇలా చేస్తే ఆహారంలో అన్నం తీసుకున్నా పెద్దగా సమస్య ఉండదు.

ఇవి కూడా చదవండి..

Health Tips: తేనెను వాడేవారు అందరూ తెలుసుకోవాల్సిన విషయం.. ఈ ఆహారాలతో అస్సలు కలిపి తినకూడదు..

Castor Oil: ముఖానికి ఆముదం రాయడం మంచిదేనా? చాలామందికి తెలియని నిజాలివీ..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 31 , 2024 | 04:33 PM