Share News

Uric acid: చలికాలంలో యూరిక్ యాసిడ్‌‌తో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి చాలు..

ABN , Publish Date - Dec 12 , 2024 | 12:40 PM

సాధారణంగా చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో అనేక ఆనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వారికి అనే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం ల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో పాటూ అనే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Uric acid: చలికాలంలో యూరిక్ యాసిడ్‌‌తో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి చాలు..

సాధారణంగా చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో అనేక ఆనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వారికి అనే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం ల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో పాటూ అనే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..


శరీరంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటికి పోతుంటుంది. అయితే మాంసం, చేపలు, రొయ్యలతో పాటూ మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతుంటాయి. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో పాటూ మధుమేహం, ఆర్థరైటిస్, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంటుంది. అలాగే గుండెలో మంట, అజీర్ణం, వెన్నునొప్పి, విపరీతమైన మంట, శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటి సమస్యలు పెరిగిపోయి చివరకు గుండెపోటుకు దారి తీసే ప్రమాదం కూడా ఉంటుంది.

health.jpg


Sugar-paneer-milk.jpg

ఏవి తినకూడదంటే..

శరీరంలో యారిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా ఉన్న వారు పప్పు, పనీర్, పాలు, చక్కెర, ఆల్కాహాల్‌, వేయించిన వస్తువులతో పాటూ టమాటాలను ఎక్కవగా తీసుకోకూడదు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరిగి అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది.


సమస్య నుంచి ఇలా బయటపడండి..

  • ఉదయం టీ స్పూన్ వేప ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే సాయంత్రం టీ స్పూన్ పెప్పల ఆకుల రసం కూడా తీసుకోవాలి.

  • గోఖరును నీటిలో బాగా మరిగించిన తర్వాత చల్లారనివ్వాలి. ఈ నీటిని రోజుకు రెండు సార్లు తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

  • మొక్కజొన్న పొట్టును నీటిలో మరిగించి, వడసోపి తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.

  • పొట్లకాయ రసంలో 7 తులసి ఆకులు, 5 ఎండుమిర్చిని కలిపి తాగడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

  • తులసి, గిలోయ్, వేప, గోధుమ గడ్డి, కలబంద మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

Updated Date - Dec 12 , 2024 | 12:40 PM