Elon Musk: రష్యా వెనక్కి తగ్గితే పుతిన్‌ను హత్య చేస్తారు.. మస్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ABN, Publish Date - Feb 14 , 2024 | 11:38 AM
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఈ యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని, ఒకవేళ రష్యా ఓడిపోయినా లేదా పుతిన్ వెనక్కి తగ్గినా ఆయనను హత్య చేసే అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే ఈ యుద్ధానికి ఇంకా ముగింపు పలకలేదని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను చెబుతోంది నిజమని, వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు.
" నా వ్యాఖ్యలపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ నేను చెబుతోంది నిజం. వాస్తవాలు తెలుసుకోవాలి. ఉక్రెయిన్‌లో రష్యా ఓడిపోయే అవకాశమే లేదు. ఉక్రెయిన్ గెలుస్తుందనుకోవడం ఆ దేశానికి ఏమాత్రం మంచిది కాదు. యుద్ధం ఇంకా కొనసాగితే ఉక్రెయిన్‌కు మరింత నష్టం. అమెరికా తాజాగా ప్రకటించిన ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు" అని టెస్లా అధినేత ఎలన్ మస్క్ వివరించారు.
కాగా.. గతంలోనూ మస్క్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం అవసరమైతే రష్యా అణు ఆయుధాలు ఉపయోగించేందుకూ వెనకాడదని అన్నారు. ఇలా చేయడం ద్వారా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశముందని చెప్పారు. యుద్ధం కారణంగా ఇప్పటికే చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 14 , 2024 | 12:22 PM