Japan: రెండు కత్తెర్లు అదృశ్యం..
ABN, Publish Date - Aug 22 , 2024 | 04:52 AM
వాతావరణం అనుకూలించక విమానాలు రద్దు కావడమో.. ఆలస్యమవడమో సాధారణమే. కానీ, ఇలాంటి సమస్య లేకుండానే జపాన్‌లోని న్యూ చిటోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 36 విమానాలు రద్దయ్యాయి.
36 విమానాలు రద్దు
201 విమానాలు ఆలస్యం..
జపాన్‌లో ఘటన ఎయిర్‌పోర్టులో ఉన్న దుకాణంలో కత్తెర్లు కనిపించకపోవడంతో కలకలం
గంటలపాటు విస్తృతంగా తనిఖీలు
టోక్యో, ఆగస్టు 21: వాతావరణం అనుకూలించక విమానాలు రద్దు కావడమో.. ఆలస్యమవడమో సాధారణమే. కానీ, ఇలాంటి సమస్య లేకుండానే జపాన్‌లోని న్యూ చిటోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 36 విమానాలు రద్దయ్యాయి. 201 విమానాలు గంటల తరబడి ఆలస్యమయ్యాయి. దీనికి కారణమేంటో తెలుసా.. విమానాశ్రయంలోని ఒక దుకాణంలో రెండు కత్తెర్లు కనిపించకపోవడమే! ఈ విషయం తెలిసి అధికారులు అప్రమత్తమై.. వాటి కోసం క్షుణ్ణమైన తనిఖీలు మొదలుపెట్టారు.
ఈ సమయంలో ఒక్క విమానాన్నీ ఎగరనివ్వలేదు. విమానాశ్రయం నుంచి బయటకు వెళుతున్న ప్రయాణికులను మరోసారి తనిఖీ చేశారు. మాయమైన కత్తెర్ల కోసం శోధనలో గంటలు గడిచిపోయాయి. ఎట్టకేలకు విమానాలు రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. ఎవరైనా ఉగ్రవాది ఆ కత్తెరను దొంగలించి.. దాన్ని ఆయుధంగా చేసుకునే ప్రమాదం ఉందనే భయంతోనే విస్తృతంగా తనిఖీలు చేశామన్నారు అధికారులు!
ఈ ఘటన ఈ నెల 17న జరగ్గా.. అదే రోజు ఆ కత్తెర్లు దొరికాయి. వాటిని ఎవరూ కొట్టేయలేదు.. ఆ దుకాణంలోనే ఓ మూల కనిపించాయి. కానీ.. అధికారులు కత్తెర్లు దొరికిన విషయాన్ని తర్వాత రోజు బయటపెట్టారు. ఎందుకంటే ఇవీ.. పోయాయనుకున్న కత్తెర్లు ఒకటేనా కాదా అని నిర్ధారించుకోవడానికట!
Also Read:
నీచాది నీచం.. డాక్టర్ నిర్వాకాన్ని బయటపెట్టిన భార్య..!
ఇసుకపై సమగ్ర పాలసీ..!!
నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి
For More International News and Telugu News..
Updated Date - Aug 22 , 2024 | 10:01 AM